విక్రమ్- పా.రంజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా తంగలాన్. ఎలాంటి ప్రకటన లేకుండానే సైలెంట్‌గా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఈ ఏడాది ఆగష్టు 15న విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది. అయితే, తంగలాన్ ఓటీటీ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా చాలారోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. అయితే, సడెన్‌గా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తంగలాన్ చిత్రం స్ట్రీమింగ్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
తంగలాన్ సినిమా ఎలాంటి ప్రకటన లేకుండానే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిల్,మలయాళం,కన్నడలో ఈ చిత్రం తాజాగా విడుదలైంది. తంగలాన్ సినిమాను ఓటీటీలో విడుదల చేయవద్దని తిరువళ్లూరుకు చెందిన పోర్కోడి మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో వైష్ణవులను అవమానించేలా చాలా సన్నివేశాలు ఉన్నాయని ఆయన పిటీషన్ వేశారు. అంతేకాకుండా బౌద్ధమతం గురించి చాలా పవిత్రంగా చూపించిన దర్శకుడు వైష్ణవులను మాత్రం కించపరిచేలా తెరకెక్కించారని పిటీషన్‌లో పేర్కొన్నారు. ఇప్పుడు ఓటీటీలో విడుదలైతే ఇరువర్గాల మధ్య మత ఘర్షణలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేసు విచారణ అనంతరం ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదలైంది.
కథేంటి..?
గోల్డ్ హంట్ నేపథ్యంలో తంగలాన్‌ను తెరకెక్కించారు పా. రంజిత్. 1850లో బ్రిటీషర్లు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో జరిగిన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ (విక్రమ్).. తన కుటుంబంతో కలిసి బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో బంగారం వెతకడం కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. మరి తంగలాన్ చివరకు బంగారం కనిపెట్టాడా? అరణ్య, ఆరతితో ఇతడికి ఉన్న సంబంధమేంటి అనేదే మెయిన్ స్టోరీ. ఈ మూవీకి సీక్వెల్ తంగలాన్ 2 ఉంటుందని విక్రమ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment