కోలీవుడ్‌కు చెందిన సిద్ధార్థ్ ఎక్కడికి వెళ్లినా వివాదాలు వెంటాడుతూనే ఉంటాయి. తాజాగా పుష్ప సినిమాపై ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే అనేకమార్లు బోలెడన్ని వివాదాలలో సిద్ధార్థ్ పేరు ఉండనే ఉంటుంది. కస్తూరి, చిన్మయి, సుచిత్రల మాదిరే అప్పుడప్పుడు ఆయన చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు వివాదాలను తీసుకురావడమే కాకుండా ట్రోలింగ్ కూడా అవుతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా పుష్ప2 సినిమాపై ప్రశంసలు వస్తున్న సమయంలో సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు తన అపరిపక్వతను చూపుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇండస్ట్రీకి చెందిన వారి నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేఖత వస్తుంది.
సిద్ధార్థ్ హీరోగా నటిస్తోన్న కొత్త సినిమా 'మిస్ యూ' డిసెంబర్ 13న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తమిళ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో పట్నాలో పుష్ప2 ఈవెంట్ కోసం భారీగా జనాలు వచ్చారు కదా.. దానిపై మీ అభిప్రాయం ఏంటి అని సిద్ధార్థ్‌కు ప్రశ్న ఎదరురైంది. అయితే, తాను కూడా ఇండస్ట్రీలో భాగమే కదా అనే భావన లేకుండా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన అభ్యంతరంగా ఉన్నాయి.
అదంతా 'పుష్ప' కోసం జిమ్మిక్: సిద్ధార్థ్
'పుష్ప 2 కోసం పట్నా ఈవెంట్‌లో 3 నుంచి 4 లక్షల మంది జనం రావడం అనేది ప్రమోషన్స్ జిమ్మిక్ తప్ప మరేమీ కాదు. మన దేశంలో, ఒక JCB తవ్విన స్థలాన్ని కూడా చూసేందుకు ప్రేక్షకులు ఎగపడుతారు. కాబట్టి, బీహార్‌లో అల్లు అర్జున్‌ని చూడటానికి ప్రజలు గుమిగూడడం అనేది పెద్ద విషయమేమి కాదు. వాళ్లు ఆర్గనైజ్ చేస్తేనే జనాలు ఉంటారు. భారతదేశంలో జనాలు వస్తేనే గొప్ప అనుకోవద్దు. అదే నిజమైతే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు తప్పక గెలవాలి. బిర్యానీ ప్యాకెట్, క్వార్టర్ బాటిల్ కోసమే ఎక్కువగా వెళ్తారు.' సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నువ్వు ఐటెమ్ డ్యాన్స్ చేసినా రారు: బన్నీ ఫ్యాన్స్
సిద్ధార్థ్ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. సిద్ధార్థ్ వీధుల్లో ఐటెమ్ డ్యాన్స్ చేసినా, బీహార్‌లో కాకుండా తమిళనాడులో కూడా అతన్ని చూడటానికి ఎవరూ రారని విరుచుకుపడుతున్నారు. తెలుగు నటులే కాకుండా ఇలాంటి వారు కూడా పుష్ప2 విజయం పట్ల అసూయతో ఉన్నారని వారు ఆరోపించారు.
వివాదాల పేరుతో తన సినిమా ప్రమోషన్ కోసం సిద్ధార్థ్ ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని చాలా మంది అంటున్నారు. అతను ఇటీవల పుష్ప 2తో తన సినిమా క్లాష్ అవ్వడం గురించి అడిగినప్పుడు 'పుష్ప 2 భయపడాలి, నేను కాదు' అని చెప్పాడు. కానీ తరువాత, అతను తన సినిమాను డిసెంబర్ 13కు వాయిదా వేసుకున్నాడు. ఈ కారణంగానే అల్లు అర్జున్ సినిమాపై ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేస్తున్నాడని తెలుస్తోంది.
SHOCKING: Siddharth compares Pushpa 2 patna event with crowd which comes to watch JCB construction👷🚧🏗️ pic.twitter.com/BMyVUo3sWa
— Manobala Vijayabalan (@ManobalaV) December 10, 2024
Comments
Please login to add a commentAdd a comment