సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మంజుమ్మెల్ బాయ్స్. 2006లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మలయాళంలో చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన మొదటి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది. మలయాళంలో రిలీజైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో తెలుగు ఆడియన్స్ సైతం ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
దీంతో టాలీవుడ్ అభిమానుల కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. తెలుగు హక్కులను సొంతం చేసుకున్న ఈ సంస్థ ఏప్రిల్ 6న రిలీజ్ చేయనున్నట్లు ట్విటర్ ద్వారా ప్రకటించింది. తెలుగు వర్షన్‌ను నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పిస్తున్నారు. కాగా.. 2006లో కొడైకెనాల్‌లోని గుణకేవ్‌లో చిక్కుకున్న తమ స్నేహితుడిని రక్షించిన ఎర్నాకులం మంజుమ్మెల్ యువకుల యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. తెలుగులోనూ అదే టైటిల్‌తో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
𝐓𝐡𝐞 𝐡𝐢𝐠𝐡𝐞𝐬𝐭 𝐠𝐫𝐨𝐬𝐬𝐢𝐧𝐠 𝐌𝐚𝐥𝐚𝐲𝐚𝐥𝐚𝐦 𝐟𝐢𝐥𝐦 - #ManjummelBoys is now coming to 𝐞𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧 𝐭𝐡𝐞 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐚𝐮𝐝𝐢𝐞𝐧𝐜𝐞 ❤️🔥
Grand release worldwide on April 6th.
Telugu release by @MythriOfficial, @Primeshowtweets & @SukumarWritings ✨… pic.twitter.com/xDULaAgbVx— Mythri Movie Makers (@MythriOfficial) March 26, 2024
Comments
Please login to add a commentAdd a comment