ఈ ఫొటోలోని ఇద్దరూ స్టార్ హీరోలే.. తండ్రి కొడుకులే కానీ! | Mammootty And Dulquer Salmaan Rare And Old Pic News | Sakshi
Sakshi News home page

Guess The Actors: సినీ ఇండస్ట్రీని ఏలుతున్న ఈ ఇద్దరూ ఎవరంటే?

Published Tue, Aug 13 2024 3:23 PM | Last Updated on Tue, Aug 13 2024 5:02 PM

Mammootty And Dulquer Salmaan Rare And Old Pic News

వారసత్వంతో ఎంట్రీ ఇవ్వడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. కానీ దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఏ రంగంలో అయినా ఇది అనుకున్నంత సులభమైతే కాదు. పైన కనిపిస్తున్న పిల్లాడు కూడా అలానే తండ్రి పేరుతో సినిమాల్లోకి వచ్చాడు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీలో సినిమాలు చేస్తూ అసలైన పాన్ ఇండియా స్టార్ అనిపించుకుంటున్నాడు. ఇంతలా చెప్పాం కదా మరి వీళ్లు ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

(ఇదీ చదవండి: తల్లి పుట్టినరోజున తిరుమలలో జాన్వీ కపూర్)

పైన ఫొటోలో కనిపిస్తున్న వాళ్లలో పిల్లాడి పేరు దుల్కర్ సల్మాన్. వ్యక్తి పేరు మమ్ముట్టి. 'సీతారామం', 'మహానటి' సినిమాలతో తెలుగులోనూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సృష్టించిన హీరోనే పైన ఫొటోలో ఉన్న పిల్లాడు. తండ్రి మమ్ముట్టి మలయాళంలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడంతో సులభంగానే దుల్కర్ ఇండస్ట్రీలోకి వచ్చేశాడు. కానీ ఎంతో కష్టపడి ఇప్పుడున్న పొజిషన్‌కి చేరుకున్నాడు.

వైవిధ్యమైన సినిమాలకు పెట్టింది పేరైన దుల్కర్ సల్మాన్.. సొంత భాష మలయాళంలో బోలెడన్ని మూవీస్ చేశాడు. తెలుగులోనూ మహానటి, సీతారామం చేశాడు. ప్రస్తుతం 'లక్కీ భాస్కర్' అనే మూవీ చేస్తున్నాడు. తమిళం, హిందీలోనే ఇదివరకే హీరోగా మూవీస్ చేసి మరీ హిట్స్ కొట్టాడు. పేరుకే తండ్రి కొడుకు గానీ మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్.. దేశవ్యాప్తంగా ఒకరిని మించి మరొకరు గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.

(ఇదీ చదవండి: ఉన్న కార్లు అమ్మేసి కొత్త కారు కొన్న దళపతి విజయ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement