ఉన్న కార్లు అమ్మేసి కొత్త కారు కొన్న దళపతి విజయ్ | Tamil Actor Thalapathy Vijay Buys New Lexus Car Cost Details Inside, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Thalapathy Vijay: ఖరీదైన లగ్జరీ కొనుగోలు చేసిన స్టార్ హీరో

Published Tue, Aug 13 2024 1:36 PM | Last Updated on Tue, Aug 13 2024 5:03 PM

Tamil Actor Vijay Buys New Lexus Car Cost Details

సామాన్యుడు కాస్త ఆలోచిస్తాడేమో గానీ సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు కొత్త కార్లు కొంటున్నట్లే ఉంటారు. సోషల్ మీడియాలో అలాంటి వీడియో లేదా పోస్టులు కనిపిస్తుంటాయి. ఇప్పుడు తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కూడా అలాంటి ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలు చేశాడు. కానీ అంతకు ముందే తన దగ్గరున్న మరో రెండు కార్లని అమ్మేశాడట. ఇంతకీ ఏంటి సంగతి?

తమిళ హీరోల్లో విజయ్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం 'ద గోట్' అనే మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత మరో సినిమా చేసి, రాజకీయాలకు అంకితమైపోతాడు. ఈ విషయాన్ని విజయ్ స్వయంగా కొన్నాళ్ల క్రితం క్లారిటీ ఇచ్చేశాడు. 'తమిళగ వెట్రి కళగం' పేరుతో రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు.

(ఇదీ చదవండి: మ్యూజిక్ డైరెక్టర్ లేని సినిమా.. అంతా కోడి అరుపుతోనే)

కార్లు అంటే విజయ్‌కి చాలా ఆసక్తి. అలా 2012లోనే రోల్స్ రాయిస్ కారుని విదేశాల నుంచి తెప్పించాడు. అయితే దీనికి ట్యాక్స్ కట్టకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. రీసెంట్‌గా దీన్ని అమ్మకానికి పెట్టినట్లు వార్తలొచ్చాయి. అయితే దీనితో పాటు వోల్వో కారుని కూడా అమ్మేశాడట. బదులుగా లెక్సెస్ ఎల్ ఎమ్ కారు కొన్నాడు.

తాజాగా విజయ్ ఇంటి నుంచి లెక్సెస్ కారు బయటకొస్తున్న వీడియోలు వైరల్ కావడంతో కొత్త కారు కొనడం నిజమని తేలిపోయింది. ఇకపోతే దీని ఖరీదు.. కోటిన్నర నుంచి రూ.2 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. కొత్త కారు కొనడం వరకు ఓకే గానీ పాత కార్లు ఇప్పుడు అంత అర్జెంట్‌గా ఎందుకు అమ్మేశాడనేది సందేహంగా మారింది!

(ఇదీ చదవండి: సెన్సార్ బోర్డ్‌లో బ్యాన్.. నేరుగా ఓటీటీలోకి తెలుగు సినిమా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement