లక్కీ భాస్కర్‌ వెరీ లక్కీ.. తెలుగులో మరో భారీ ప్రాజెక్ట్ | Malayala Hero Dulquer Salmaan Announcer Another Project In Tollywood | Sakshi
Sakshi News home page

Dulquer Salmaan: లక్కీ భాస్కర్ మరో క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

Published Sun, Feb 2 2025 8:41 PM | Last Updated on Sun, Feb 2 2025 8:41 PM

Malayala Hero Dulquer Salmaan Announcer Another Project In Tollywood

లక్కీ భాస్కర్‌తో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న మలయాళ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan). తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యారు. టాలీవుడ్‌లోనే మరో సినిమాను ప్రకటించారు. ఈ సారి టాలీవుడ్ డైరెక్టర్ పవన్‌ సాధినేనితో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో రానున్న చిత్రానికి 'ఆకాశంలో ఒకతార' అనే టైటిల్‌ ఖరారు చేశారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు.

ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌, స్వప్న సినిమా సమర్పిస్తుండగా లైట్‌బాక్స్‌ మీడియా బ్యానర్‌లో తెరకెక్కించనున్నారు. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్‌ కొట్టగా.. మరో నిర్మాత అశ్వనీ దత్ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన  హీరోయిన్‌తో పాటు నటీనటుల వివరాలను మేకర్స్ ప్రకటించనున్నారు. మరికొద్ది రోజుల్లోనే రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement