
హీరో వెంకటేశ్‌తో పాటు మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే, ఈ మూవీకి భారీ బజ్ క్రియేట్ చేసిన ఒక సాంగ్ ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించి ఈ చిత్రం జనవరి 14న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 310 కోట్లకు పైగానే రాబట్టింది. వెంకీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే ఈ చిత్రం 92 కేంద్రాల్లో 50రోజులు పూర్తి చేసుకుంది.
అయితే, సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలోని ‘గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..!’ అంటూ సాగే ఆ పాట సినిమాకు ప్రధాన బలమైంది. ఇప్పటి వరకు ఈ లిరికల్ వీడియో సాంగ్ 200 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. టాలీవుడ్‌లో తక్కువ సమయంలోనే ఈ మార్క్ అందుకున్న పాటగా రికార్డ్ క్రియేట్ చేసింది. గతంలో కేవలం మూడు వారాల్లోనే 50 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సాంగ్‌కు భాస్కరభట్ల సాహిత్యం అందించగా.. సుమారు 18 ఏళ్ల తర్వాత రమణగోగుల ఆలపించడం విశేషం. ఫిమేల్ లిరిక్స్‌ను మధుప్రియ కూడా చాలా అద్భుతంగా పాడింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే, తాజాగా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్‌లో 2 గంటలా 24 నిమిషాలు ప్రదర్శితమవగా.. జీ5లో కేవలం 2 గంటలా 16 నిమిషాల నిడివితో సినిమాను ఉంచారు. దాదాపు ఎనిమిది నిమిషాల సీన్స్ తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment