
శర్వానంద్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా, చైల్డ్ ఆర్టిస్టు విక్రమాదిత్య కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ఇది. సుమారు ఏడాది తర్వాత ఓటీటీలోకి రానుంది. ఈమేరకు తాజాగా ప్రకటన కూడా వచ్చేసింది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు. కానీ, బాక్సాఫీసు వద్ద లాభాలను తెచ్చిపెట్టింది.
శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా 'మనమే' సినిమా ఓటీటీ వివరాలను మేకర్స్ ప్రకటించారు. మార్చి 7న 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో ఈ చిత్రం విడుదల కానుందని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. మనమే చిత్రం విడుదల సమయంలో బాక్సాఫీస్ బరిలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో శర్వానంద్‌కు ప్లస్ అయింది. మనమే కథా నేపథ్యం చాలా బాగుంటుంది. ఇందులో వినోదంతో పాటు భావోద్వేగాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి.

హీరో శర్వానంద్ బైక్ రేసింగ్‌తో ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. శర్వా నంద్ హీరోగా అభిలాష్ కంకర్ డైరెక్షన్‌లో ‘రేజ్ రాజా’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో మోటారు బైకు రేసర్‌గా శర్వానంద్ నటిస్తున్నారు. 1990 నుంచి 2000ల మధ్య కాలంలో జరిగే ఈ స్పోర్ట్స్ మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే... స్పోర్ట్స్ డ్రామా జానర్‌లో సినిమాలు చేసిన అనుభవం శర్వానంద్‌కు ఉంది. ‘మళ్ళీ మళ్లీ ఇది రాని రోజు (2015)’ మూవీలో రన్నింగ్ రేసర్‌గా, ‘పడి పడి లేచే మనసు (2018)’ మూవీలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా శర్వానంద్ నటించి, మెప్పించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment