ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర'. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'యాత్ర 2' ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2' ఉంటుంది.
(చదవండి: యాత్ర 2' ట్రైలర్.. అంచనాలు పెంచేస్తున్న ఈ డైలాగ్స్)
వైఎస్సార్, ఆయన తనయుడి జీవితంలో జరిగిన యథార్థంగా జరిగిన సంఘటనలే ఆధారంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ మహీ వి. రాఘవ్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డిపాత్రలో మమ్ముట్టి, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపాత్రలో జీవా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన యాత్ర-2 టీజర్, సాంగ్స్ సినీ ప్రేక్షకులతో పాటు వైఎస్సార్ అభిమానుల గుండెలను తాకాయి. తాజాగా యాత్రా 2 నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
‘పుట్టుకతోనే చెవుడు ఉంది అన్న.. చెవుడు వల్ల మాటలు కూడా రావు. ఏదో మిషిన్ పెడితే వినబడి మాటలు వస్తాయని డాక్టర్లు చెప్పారు. అన్నా.. మాకు అంత స్థోమత లేదు’ అని ఓ సామాన్యురాలు తన కూతురికి గురించి సీఎం వైఎస్సార్(మమ్ముట్టి)కి చెప్పే సీన్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. వైఎస్సార్ మరణం.. జగన్ ఓదార్పు యాత్రకు అడ్డుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ చేసే కుట్రలు.. పార్టీ పెట్టిన తర్వాత జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి వచ్చిన మద్దతు..ఇవన్నీ ట్రైలర్‌లో హృదయాలను హత్తుకునేలా చూపించారు. ఇక చివర్లో ఓ అంధుడు ‘నువ్వు మా వైఎస్సార్ కొడుకువు అన్నా..మాకు నాయకుడిగా నిలబడు అన్నా’అని అనగా..నేను విన్నాను..నేను ఉన్నాను’ అని జగన్(జీవా) చెప్పే డైలాగ్‌తో ఎమోషనల్‌గా ట్రైలర్ ముగిసింది.
దేశంలో ఇప్పటి వరకు ఎందరో ప్రముఖలు జీవితాలపై బయోపిక్‌లుగా పలు చిత్రాలు వచ్చాయి.. వాటంన్నింటికీ దక్కని క్రేజ్ యాత్ర సీక్వెల్ చిత్రాలకు దక్కింది. ఇంతలా యాత్ర-2కు ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. దేశంలోనే అత్యంత ఆదరణ ఉన్న ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్ గారు ఒకరు.. అంతే కాకుండా ఆయనొక అగ్రెసివ్ రాజకీయ నాయకుడు, మాస్ లీడర్, ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీకి అధినేత.. అంతలా ఇమేజ్ ఉన్న నాయకుడి గురించి తీసే బయోపిక్‌ను అంతే స్థాయిలో పొయెటిక్‌గా తెరమీదకు తీసుకురావడం డైరెక్టర్ మహి కే సాధ్యమైంది. ఆందుకే ఆయన నిజ జీవితాన్ని మరొకసారి వెండితెరపై చూసేందుకు కోట్ల మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment