![Yatra 2 Movie Teaser To Release On 5th January - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/2/yatra-2.jpg.webp?itok=ElsBSN1b)
‘యాత్ర’మూవీకి సీక్వెల్‌గా ‘యాత్ర 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహి వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా నటిస్తున్నారు. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.
(చదవండి: కన్నీళ్లు తెప్పిస్తున్న చిన్నారుల బాధ.. భారీ సాయం చేసిన హీరో)
ఈ ఏడాది ఫిబ్రవరి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. ఇప్పటికే హీరో జీవా లుక్‌తో పాటు వైఎస్ భారతీ పాత్ర పోషిస్తున్న మరాఠీ నటి కేతకి నారాయణన్ లుక్‌ని కూడా రిలీజ్ చేశారు. ఇక త్వరలోనే ఈ సినిమా టీజర్‌ని విడుదల చేయబోతున్నారు. జనవరి 5న యాత్ర 2 టీజర్ రాబోతుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ.. మమ్ముట్టి, జీవాలకు సంబంధించిన కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment