న్యూయార్క్: అమెరికా న్యూయార్క్ నగరంలోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వద్ద బాంబు కలకలం రేగింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని మొత్తం బ్లాక్ చేసి బాంబు స్వ్కాడ్‌తో తనిఖీలు చేపట్టారు. శనివారం టైమ్స్ స్క్వేర్ నుంచి ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనా మద్దతుదారులు ఒక ర్యాలీ తీశారు.
ఈ ర్యాలీ సమయంలో అటుగా వచ్చిన అక్కడికి వచ్చిన క్యాబ్ డ్రైవర్ ప్రయాణికుడిని దించిన వెంటనే తన కారు వెనుక సీటులో గ్రెనేడ్‌ను గమనించాడు. దీంతో వెంటనే అతడు పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకుని క్యాబ్ ఉన్న ప్రదేశానికి వస్తున్న బాంబ్ స్క్వాడ్ ఎమర్జెన్సీ వాహనాన్ని ర్యాలీ చేస్తున్న వారు అడ్డుకున్నారు.
దీంతో బాంబ్ స్క్వాడ్ వాహనం గ్రెనేడ్ వద్ద ఉన్న క్యాబ్ వద్దకు వచ్చేసరికి ఆలస్యమైంది. చివరకు అక్కడకు చేరుకున్న పోలీసులు గ్రెనేడ్ నిర్వీర్యమైనదేనని తేల్చారు. బాంబ్ స్క్వాడ్ వాహనాన్ని అడ్డుకున్న వారికి జైలు తప్పదని పోలీసులు ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment