grenade
-
NewYork: టైమ్స్ స్క్వేర్ వద్ద బాంబు కలకలం
న్యూయార్క్: అమెరికా న్యూయార్క్ నగరంలోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వద్ద బాంబు కలకలం రేగింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని మొత్తం బ్లాక్ చేసి బాంబు స్వ్కాడ్‌తో తనిఖీలు చేపట్టారు. శనివారం టైమ్స్ స్క్వేర్ నుంచి ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనా మద్దతుదారులు ఒక ర్యాలీ తీశారు. ఈ ర్యాలీ సమయంలో అటుగా వచ్చిన అక్కడికి వచ్చిన క్యాబ్ డ్రైవర్ ప్రయాణికుడిని దించిన వెంటనే తన కారు వెనుక సీటులో గ్రెనేడ్‌ను గమనించాడు. దీంతో వెంటనే అతడు పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకుని క్యాబ్ ఉన్న ప్రదేశానికి వస్తున్న బాంబ్ స్క్వాడ్ ఎమర్జెన్సీ వాహనాన్ని ర్యాలీ చేస్తున్న వారు అడ్డుకున్నారు. దీంతో బాంబ్ స్క్వాడ్ వాహనం గ్రెనేడ్ వద్ద ఉన్న క్యాబ్ వద్దకు వచ్చేసరికి ఆలస్యమైంది. చివరకు అక్కడకు చేరుకున్న పోలీసులు గ్రెనేడ్ నిర్వీర్యమైనదేనని తేల్చారు. బాంబ్ స్క్వాడ్ వాహనాన్ని అడ్డుకున్న వారికి జైలు తప్పదని పోలీసులు ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. ఇదీ చదవండి.. ఐఎస్ఎస్కు వ్యోమగాముల ప్రయాణం వాయిదా -
బోథ్ అడవుల్లో మావోయిస్టులు? పోలీసుల అలెర్ట్!
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని బోథ్ అడవుల్లో మావోయిస్టులు సంచరించినట్లు తెలుస్తోంది. 20 రోజుల క్రితం బోథ్ మండలంలోని కైలాస్ టెకిడి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం ఉదయం బోథ్ సీఐ నైలు నాయక్ ఆధ్వర్యంలో కైలాస్ టెకిడి అడవుల్లో కూంబింగ్ నిర్వహించారు. ఓ గుట్ట వద్ద గ్రెనేడ్ పడి ఉండడాన్ని పోలీసులు గమనించి వెంటనే ఉన్నతాధికారులకు పంపించారు. దీంతో పోలీసులు జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. కైలాస్టెకిడి అటవీ ప్రాంతం ఆగస్టులోనే వచ్చారా..? కైలాస్ టెకిడి అటవీ ప్రాంతంలో గ్రెనేడ్ లభిచండంతో ఆ గ్రెనేడ్ నేలపై ఎన్ని రోజుల క్రితం పడిందని పోలీసులు లెక్కలేస్తున్నారు. 15 నుంచి 30 రోజుల వ్యవధిలోనే మావోల బ్యాగుల నుంచి ఇది నేల మీద పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మహారాష్ట్ర నుంచి వచ్చారా? లేక తిర్యాణి అడవుల్లో ఉన్నట్లు భావిస్తున్న అడెల్లు దళం వచ్చిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అడెల్లు స్వస్థలం బోథ్ మండలంలోని పొచ్చర కావడంతో అతనే వచ్చాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జారి పడిందా? విడిచి వెళ్లారా? అటవీ ప్రాంతంలో గ్రెనేడ్ మావోయిస్టుల బ్యాగులో నుండి జారి పడిందా? లేదా కావాలని విడిచి వెళ్లారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల దృష్టిని మరల్చడానికి విడిచివెళ్లారన్న వాదన వినిపిస్తున్నా పోలీసులు మాత్రం కచ్చితంగా మావోయిస్టుల వద్ద నుండే గ్రెనేడ్ కింద పడి ఉంటుందని పేర్కొంటున్నారు. వివరాలు వెల్లడించని పోలీసులు గ్రెనెడ్ లభ్యమైందని పోలీసులు అనధికారికంగా ధృవీకరించినా వివరాలు మాత్రం వెల్లడించలేదు. న్నతాధికారులే పూర్తి వివరాలు వెల్లడిస్తారని బోథ్ సీఐ నైలు నాయక్ పేర్కొన్నారు. ఎస్పీ ఉదయ్ కుమార్‌రెడ్డి గ్రెనేడ్‌కు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలస్తోంది. ప్రజాప్రతినిధులు అలర్ట్‌గా ఉండాలి ప్రజాప్రతినిధులు గ్రామాల్లోకి వెళ్లవద్దని పోలీసులు సూచించారు. ఒకవేళ గ్రామాలకు వెళ్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే తమకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. బోథ్ అడవుల్లో గ్రెనేడ్ లభ్యం బోథ్ మండలం నిగిని గ్రామ సమీపంలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కైలాస్ టెకిడి అటవీ ప్రాంతంలో సీఐ నైలునాయక్ ఆధ్వర్యంలో గురువారం కూంబింగ్ నిర్వహిస్తుండగా భూమిపై పడి ఉన్న గ్రెనేడ్‌ను గుర్తించారు. బాంబ్ స్క్వాడ్ సాయంతో ఉన్నతాధికారులకు పంపించారు. ఎలా వచ్చిందో విచారణ చేపడుతున్నారు. 15 నుంచి నెల రోజుల మధ్య అటవీ ప్రాతంలో పడి ఉన్నట్లు భావిస్తున్నారు. -
అసెంబ్లీలో గ్రెనేడ్.. లోకాయుక్తకు కత్తిపోట్లు
తిరువనంతపురం : తిరువాంచూర్ రాధాకృష్ణన్.. కేరళలో కాంగ్రెస్ ఎమ్మెల్యే.. మాజీ హోంమంత్రి కూడా.. బుధవారం ఆయన అసెంబ్లీకి ఓ కవర్లో గ్రెనేడ్‌ను తెచ్చారు.. సభలోకి వచ్చి కవర్ నుంచి దాన్ని బయటికి తీసి చూప డంతో సభ్యులంతా భయాందోళనలకు గురయ్యారు. రాష్ట్రంలో పోలీసుల అకృత్యాలకు నిరసనగానే ఇలా చేసినట్టు ఆయన వివరణ ఇచ్చారు. యూత్ కాంగ్రెస్ నాయకుడు సుహైబ్ హత్యను నిరసిస్తూ ఆందోళనకు దిగిన తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు ప్రయోగించిన గ్రెనేడ్లలో ఒకదాన్ని తెచ్చానని వెల్లడించారు. గ్రెనేడ్‌ను రాధాకృష్ణన్ తానే భద్రతా సిబ్బందికి అప్పగించారు. దీనిపై సీఎం విజయన్ సహా అధికార పార్టీ సభ్యులు మండిపడ్డారు. రాధాకృష్ణన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేరళ అసెంబ్లీలోకి బాంబులు తేవడం ఇది తొలిసారి కాదు. 2012లోనూ ఇలాగే పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ అప్పటి ప్రతిపక్ష సీపీఎం సభ్యుడొకరు 2 టియర్ గ్యాస్ షెల్‌ను సభలోకి తెచ్చారు. అప్పుడు రాధాకృష్ణన్ హోంమంత్రిగా ఉండటం గమనార్హం. బెంగళూరు : కర్ణాటక లోకాయుక్త జస్టిస్ పి.విశ్వనాథ షెట్టిపై ఆయన కార్యాలయంలోనే దాడి జరిగింది. గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బెంగళూరులోని విధాన సౌధ భవనం పక్కనే ఉన్న ఎంఎస్ బిల్డింగ్‌లోని గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే లోకాయుక్త కార్యాలయం ఉంది. బుధవారం ఉదయం తుమకూర్‌కు చెందిన తేజరాజ్ శర్మ(36) అనే కాంట్రాక్టర్ కార్యాలయానికి వచ్చాడు. 15 మంది ప్రభుత్వ అధికారులపై అవినీతి ఆరో పణలున్న ఫిర్యాదును అక్కడి అధికారులకు అందజేయగా.. ఆ కేసును మూసివేశారని వారు బదులిచ్చారు. దీంతో లోకాయుక్త చాంబర్లోకి వెళ్లిన శర్మ వెంట తెచ్చుకున్న కత్తితో జస్టిస్ విశ్వనాథ షెట్టిపై దాడి చేసి నాలుగైదు చోట్ల పొడిచాడు. ఆయన గట్టిగా కేకలు వేయటంతో సిబ్బంది వచ్చి వెంటనే ఆస్పత్రికి తరలించారు. నిందితుడు శర్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విశ్వనాథ షెట్టిని సీఎం సిద్ధరామయ్య ఆస్పత్రిలో పరామర్శించారు. ఆయనకు ప్రాణహాని లేదని వైద్యులు తెలిపినట్లు చెప్పారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్.. సీఎం సిద్ధ రామయ్యకు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. -
గ్రెనేడ్‌తో అసెంబ్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యే
తిరువనంతపురం : గ్రనేడ్‌తో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అసెంబ్లీలోకి అడుగుపెట్టి కలకలం సృష్టించారు. నేరుగా అసెంబ్లీ స్పీకర్ వద్దకు వెళ్లి గడువు తీరిన ఈ గ్రెనేడ్‌ను గత వారం పోలీసులు తమ పార్టీ కార్యకర్తలపై ఉపయోగించారంటూ చూపించారు. తొలుత అది ఉపయోగించని గ్రెనేడ్ అనుకొని కొందరు కంగారు పడినా స్పీకర్‌కు దాన్ని చూపించి వివరాలు చెప్పన తర్వాత వారు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తిరువంచూర్ అనే ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాధాకృష్ణన్ బుధవారం ఉదయం కేరళ అసెంబ్లీలోకి ఓ ఉపయోగించిన గ్రెనేడ్‌తో అడుగుపెట్టారు. గత వారం యూత్ కాంగ్రెస్ ఉద్యమకారులు ఓ అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తుండగా పోలీసులు ఎక్స్పైరీ అయిపోయిన గ్రెనేడ్‌ను ఉపయోగించారని, అందుకు సాక్షంగా తాను దానిని అసెంబ్లీలోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ‘ఇది పోలీసుల రాజ్యం. యువ ఆందోళన కారులను చెదరగొట్టేందుకు వారు హానీకరమైన మందుగుండు సామాగ్రి ఉపయోగిస్తున్నారు. గడువు తీరిన వాటిని అమాయకులపై ప్రయోగిస్తున్నారు.. అందుకు నా చేతిలోని గ్రెనేడ్ సాక్ష్యం’ అంటూ ఆయన చెప్పారు. అయితే, అది టియర్ గ్యాస్ గోళం అని గ్రెనేడ్ కాదని మరికొందరు చెబుతున్నారు. -
రాయబార కార్యాలయంలోకి గ్రనేడ్ విసిరారు
ఏథెన్స్: ఫ్రాన్స్ రాయబార కార్యాలయంపై దాడి జరిగింది. గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వచ్చి గ్రీకులోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయంపైకి గ్రనేడ్ విసిరారు. ఈ పేలుడులో ఓ పోలీసు అధికారి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడికి సంబంధించి గ్రీక్ యాంటీ టెర్రరిజం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం గురువారం ఉదయం 5గంటల ప్రాంతంలో ఈ దాడి చోటుచేసుకుంది. దాడి జరిగిన ప్రాంతం గ్రీకు దేశ పార్లమెంటుకు సమీపంలో ఉంది. కొంతమంది ప్రలోభంతో స్థానికులే ఈ దాడికి పాల్పడి ఉంటారని భావించిన పోలీసులు గతంలో ఈ తరహా దాడులకు పాల్పడిన స్థానికుల జాబితా తిరగేస్తున్నారు. -
ఆ గ్రెనేడ్లపై పాక్ గుర్తులు
శ్రీనగర్: కశ్మీర్‌లోని నౌగామ్ సెక్టార్లో గురువారం నలుగురు ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న గ్రెనేడ్లపై పాకిస్తాన్‌కు సంబంధించిన గుర్తులున్నాయని ఆర్మీ తెలిపింది. ఈ గ్రెనేడ్లపై ఉన్న పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులు.. ఉగ్రవాదానికి పాక్ సహకరిస్తోందనే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయని ఆర్మీ అధికార ప్రతినిధి ఒకరు శనివారం పేర్కొన్నారు. ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న మందులు, ఆహారపదార్థాలపై కూడా పాక్ గుర్తులు ఉన్నాయని ఆయన తెలిపారు. గురువారం పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వ్యాలీలోకి ప్రవేశించేందుకు యత్నించిన నలుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టిన విషయం తెలిసిందే. -
గ్రెనేడ్ దాడులతో దద్దరిల్లిన షాపియన్!
శ్రీనగర్ః జమ్మూ కాశ్మీర్ లో తీవ్రవాదులు దాడులకు దిగారు. పది నిమిషాల వ్యవధిలో రెండుసార్లు గ్రెనేడ్లతో దాడులకు పాల్పడ్డారు. పోలీసులే లక్ష్యంగా చేసుకున్న టెర్రరిస్టులు ఓ పోలీస్ స్టేషన్ పై గ్రెనేడ్ విసిరారు. మరోచోట పోలీస్ చెక్ పోస్ట్ పై కూడ గ్రెనేడ్ తో దాడి చేశారు. గ్రెనేడ్ స్టేషన్ బయటే పేలిపోవడంతో తృటిలో భారీ ప్రమాదం తప్పగా, చెక్ పోస్ట్ ప్రాంతంలో ఇద్దరు సాధారణ పౌరులకు గాయాలయ్యాయి. కాశ్మీర్ లోని షాపియన్ జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన టెర్రరిస్టుల గ్రెనేడ్ దాడుల్లో ఇద్దరు సాధారణ పౌరులు గాయపడ్డారు. సాయంత్ర 5.30 ప్రాంతంలో షాపియన్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ బిల్టింగ్ ప్రాంతంలో టెర్రరిస్టులు పోలీస్ స్టేషన్ పై గ్రెనేడ్ విసిరినట్లు అధికారులు వెల్లడించారు. అయితే గ్రెనేడ్ పోలీస్ స్టేషన్ కాంపౌండ్ లోపలే పడిపోవడంతో ఎటువంటి నష్టం జరగలేదని తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు 200 మీటర్ల దూరంలోనే ఉన్న చెక్ పోస్టుపై కూడ టెర్రరిస్టులు గ్రెనేడ్ తో దాడులు జరిపారని, ఆ దాడుల్లో ఇద్దరు పౌరులు గాయపడినట్లు వెల్లడించారు. గాయపడిన వారిని చికిత్సకోసం స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఉన్నట్లుండి జరిగిన దాడులతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది రంగంలోకి దిగి మిలిటెంట్లకోసం గాలిస్తున్నారు. -
ముఖంలో పేలని గ్రెనేడ్.. వైద్యుల ఆ'పరేషన్'
బొగోటా: ప్రమాదవశాత్తూ ఓ సైనికుడి ముఖంలోకి దూసుకెళ్లిన గ్రెనేడ్‌ను వైద్యులు ఆపరేషన్ చేసి తొలగించారు. కొలంబియాలోని బొగోటాలో చోటు చేసుకున్న ఈ ఘటనలో కారు పార్కింగ్ స్థలాన్నే మిలిటరీ ఆసుపత్రి డాక్టర్లు ఆపరేషన్ థియెటర్గా మార్చారు. గ్రెనేడ్ ఏ క్షణంలో అయినా పేలే ప్రమాదం ఉండటంతో డాక్టర్లు ఈ ఆపరేషన్‌ను జాగ్రత్తగా పూర్తి చేసి సైనికుడి ప్రాణాలతో పాటు తమ ప్రాణాలనూ కాపాడుకున్నారు. కొలంబియా సైనికుడి ముఖంలోకి ఆ గ్రెనేడ్ ఎలా దూసుకెళ్లింది అనే విషయంపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. మిలిటరీ క్యాంప్‌లో జరిగిన ఓ ప్రమాదంలో గ్రెనేడ్ ముఖంలోకి దూసుకెళ్లినట్లు భావిస్తున్నారు. గ్రెనేడ్‌ను తొలగించడంతో సదరు సైనికుడు ఇప్పుడు కోలుకుంటున్నాడు. అత్యంత ధైర్యసాహసాలతో ఆపరేషన్ నిర్వహించిన వైద్యులను ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు. చీఫ్ సర్జన్ విలియం సాంచెజ్ మాట్లాడుతూ..' గ్రెనేడ్ ఏ క్షణంలో అయినా పేలే ప్రమాదం ఉండటంలో మిగిలిన పేషెంట్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని కారు పార్కింగ్ స్థలంలో ఆపరేషన్‌ను నిర్వహించాం. అవి చాలా ఉద్విగ్నమైన క్షణాలు. పేలుడు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం' అని తెలిపారు. -
సీఆర్పీఎఫ్ స్థాపరంపై గ్రెనేడ్ దాడి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లో మరోసారి గ్రెనేడ్ దాడి జరిగింది. సీఆర్పీఎఫ్ స్థావరంపై తీవ్రవాదులు దాడిచేసినట్టు తెలుస్తోంది. శ్రీనగర్ పట్టణంలోని సేకిదఫర్ లోని పోలీసు బంకర్ దగ్గర ఈ గ్రెనేడ్ పేలుడు సంభవించింది. దీంతో స్థానికంగా ఉద్రిక్తతను రాజేసింది. అయితే ఈ పేలుడులో ఎవరూ గాయపడలేదు. రెండు పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
తూచ్.. అది బాంబు కాదు.. ప్లాస్టిక్ బ్యాగే!
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి స్టాండ్‌బైగా ఉంచిన విమానంలో బాంబు ఉందంటూ వచ్చినవన్నీ వదంతులేనని ఎయిరిండియా స్పష్టం చేసింది. అది బాంబు కాదని, కేవలం ఒక ప్లాస్టిక్ బ్యాగ్ మాత్రమేనని ఎయిరిండియా అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెళ్లడానికి స్టాండ్ బైగా ఉంచిన ఎయిరిండియా బోయింగ్ 747 విమానంలో గ్రెనేడ్ లాంటి వస్తువు కనిపించడంతో భద్రతా ఏజెన్సీలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అసలే మోదీకి ప్రాణభయం ఉందంటూ ఇంతకుముందు కథనాలు రావడం, ఇప్పుడు ఇలాంటి గ్రెనేడ్ తరహా వస్తువు కనిపించడంతో అంతా షాకయ్యారు. ప్రధాని అమెరికా వెళ్లినప్పుడు అత్యవసర పరిస్థితిలో ఉపయోగించేందుకు వీలుగా ఈ విమానాన్ని ఢిల్లీలో ఉంచారు. మళ్లీ ఆయన తన పర్యటన ముగించుకుని తిరిగి భారతదేశానికి వచ్చిన తర్వాతే దాన్ని వాణిజ్యపరంగా వెళ్లేందుకు అనుమతించారు. ఆ తర్వాత అది ముంబై వెళ్లి అక్కడినుంచి హైదరాబాద్ మీదుగా జెడ్డాకు వెళ్లింది. అది జెడ్డాలో ల్యాండ్ అయిన తర్వాతే అందులో అనుమానాస్పద వస్తువును గుర్తించారు. వెంటనే భద్రతాధికారులను అప్రమత్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్లా.. మోదీ కోసం ఉంచిన విమానంలో బాంబు ఉందన్న కథనాలు వచ్చేశాయి. విమానాన్ని సురక్షితమైన చోటుకు చేర్చి, అక్కడ పరిశీలించారు. తీరా చూస్తే అది ప్లాస్టిక్ బ్యాగ్ మాత్రమేనని తేలింది.