
కేరళ అసెంబ్లీ (ఫైల్ ఫొటో)
తిరువనంతపురం : గ్రనేడ్‌తో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అసెంబ్లీలోకి అడుగుపెట్టి కలకలం సృష్టించారు. నేరుగా అసెంబ్లీ స్పీకర్ వద్దకు వెళ్లి గడువు తీరిన ఈ గ్రెనేడ్‌ను గత వారం పోలీసులు తమ పార్టీ కార్యకర్తలపై ఉపయోగించారంటూ చూపించారు. తొలుత అది ఉపయోగించని గ్రెనేడ్ అనుకొని కొందరు కంగారు పడినా స్పీకర్‌కు దాన్ని చూపించి వివరాలు చెప్పన తర్వాత వారు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తిరువంచూర్ అనే ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాధాకృష్ణన్ బుధవారం ఉదయం కేరళ అసెంబ్లీలోకి ఓ ఉపయోగించిన గ్రెనేడ్‌తో అడుగుపెట్టారు.
గత వారం యూత్ కాంగ్రెస్ ఉద్యమకారులు ఓ అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తుండగా పోలీసులు ఎక్స్‌పైరీ అయిపోయిన గ్రెనేడ్‌ను ఉపయోగించారని, అందుకు సాక్షంగా తాను దానిని అసెంబ్లీలోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ‘ఇది పోలీసుల రాజ్యం. యువ ఆందోళన కారులను చెదరగొట్టేందుకు వారు హానీకరమైన మందుగుండు సామాగ్రి ఉపయోగిస్తున్నారు. గడువు తీరిన వాటిని అమాయకులపై ప్రయోగిస్తున్నారు.. అందుకు నా చేతిలోని గ్రెనేడ్ సాక్ష్యం’ అంటూ ఆయన చెప్పారు. అయితే, అది టియర్ గ్యాస్ గోళం అని గ్రెనేడ్ కాదని మరికొందరు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment