రాయబార కార్యాలయంలోకి గ్రనేడ్ విసిరారు | Grenade thrown at French embassy in Greece, policeman hurt | Sakshi
Sakshi News home page

రాయబార కార్యాలయంలోకి గ్రనేడ్ విసిరారు

Published Thu, Nov 10 2016 3:07 PM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM

రాయబార కార్యాలయంలోకి గ్రనేడ్ విసిరారు

రాయబార కార్యాలయంలోకి గ్రనేడ్ విసిరారు

ఏథెన్స్: ఫ్రాన్స్ రాయబార కార్యాలయంపై దాడి జరిగింది. గుర్తు తెలియని దుండగులు బైక్పై వచ్చి గ్రీకులోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయంపైకి గ్రనేడ్ విసిరారు. ఈ పేలుడులో ఓ పోలీసు అధికారి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడికి సంబంధించి గ్రీక్ యాంటీ టెర్రరిజం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం గురువారం ఉదయం 5గంటల ప్రాంతంలో ఈ దాడి చోటుచేసుకుంది. దాడి జరిగిన ప్రాంతం గ్రీకు దేశ పార్లమెంటుకు సమీపంలో ఉంది. కొంతమంది ప్రలోభంతో స్థానికులే ఈ దాడికి పాల్పడి ఉంటారని భావించిన పోలీసులు గతంలో ఈ తరహా దాడులకు పాల్పడిన స్థానికుల జాబితా తిరగేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement