assailants
-
రాయబార కార్యాలయంలోకి గ్రనేడ్ విసిరారు
ఏథెన్స్: ఫ్రాన్స్ రాయబార కార్యాలయంపై దాడి జరిగింది. గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వచ్చి గ్రీకులోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయంపైకి గ్రనేడ్ విసిరారు. ఈ పేలుడులో ఓ పోలీసు అధికారి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడికి సంబంధించి గ్రీక్ యాంటీ టెర్రరిజం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం గురువారం ఉదయం 5గంటల ప్రాంతంలో ఈ దాడి చోటుచేసుకుంది. దాడి జరిగిన ప్రాంతం గ్రీకు దేశ పార్లమెంటుకు సమీపంలో ఉంది. కొంతమంది ప్రలోభంతో స్థానికులే ఈ దాడికి పాల్పడి ఉంటారని భావించిన పోలీసులు గతంలో ఈ తరహా దాడులకు పాల్పడిన స్థానికుల జాబితా తిరగేస్తున్నారు. -
అక్కను వేధించిన వారికి బుద్ది చెప్పిన మరునాడే..
షహజాన్ పూర్: తన సోదరిని ఏడిపించేందుకు ప్రయత్నించిన జులాయిలను అడ్డుకున్నాడని ఓ పదిహేడేళ్ల యువకుడిపై కిరోసిన్ పోసి నిప్పటించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని షహజన్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం అతడు 50శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్ప పొందుతున్నాడు. సూరజ్ కశ్యప్ అనే యువకుడికి ఓ సోదరి ఉంది. వారిది సౌఫ్రీ అనే గ్రామం. ఈ గ్రామంలో కొంతమంది తాగుబోతు యువకులు వాళ్లింటి ముందు ఫుల్లుగా మద్యం సేవిస్తూ అడ్డగోలిగా అసభ్యంగా మాట్లాడుతుండటంతో కశ్యప్ వచ్చి వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించాడు. దీంతో వాళ్లు ఇంట్లోకి చొరబడి తన సోదరిని వేధించడం మొదలుపెట్టారు. దీంతో ఆ నలుగురితో యువకుడు పోరాడగా చుట్టుపక్కల వారు కూడా వచ్చి వారిని తరిమికొట్టారు. ఇది మనసులో పెట్టుకున్న వారు అతడు ఒంటరిగా బయటకు వెళుతుండం చూసి కాపుకాసి దాడి చేశారు. బాగా కొట్టి కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. -
‘ఆ హత్య ప్రత్యక్షంగా చూసి భయంతో పరుగెత్తాను’
ముంబయి: కమ్యూనిస్టు ప్రముఖ నేత గోవింద్ పన్సారేను గుర్తు తెలియని దుండగులు ఎలా కాల్చి చంపారనే విషయాన్ని ఓ పద్నాలుగేళ్ల బాలుడు వివరించాడు. గత ఏడాది ఫిబ్రవరి 16న కోలాపూర్ లో మార్నింగ్ వాక్ కు తన భార్యతో కలిసి బయటకు వెళ్లిన గోవింద్ పన్సారే దంపతులపై ఓ బైక్ పై వచ్చిన ఇద్దరు సాయుధ దుండగులు కాల్పులు జరిపి వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి ఈ పద్నాలుగేళ్ల బాలుడే ప్రత్యక్ష సాక్షి. అతడు పోలీసులకు ఏం చెప్పాడంటే.. ’ఒక్కసారిగా టపాసుల చప్పుడులాగా గట్టిగా వినిపించింది. ఆ సమయంలో స్కూల్ కి వెళ్తున్న నేను ఆ శబ్దం వైపు చూశాను. ఓ బైక్ పై ఉన్న వ్యక్తి ఓ పెద్దావిడపై కాల్పులు జరిపాడు. ఆమె పడిపోయింది. దాంతో అక్కడి నుంచి యూ టర్న్ తీసుకొని వేగంగా కదిలాడు. ఆ సమయంలో ఓ సైకిలిస్టును ఢీకొట్టాడు. ఆ వెంటనే తనవైపుగా వస్తున్న అజోబా(మరాఠీలో తాతయ్యను అజోబా అంటారు)పై మరో యువకుడు పలుమార్లు కాల్పులు జరిపాడు. దీంతో ఆయన కూడా కుప్పకూలిపోయారు. నేనప్పుడు ఆ తాతయ్య వద్దకు పరుగెట్టే ప్రయత్నం చేయగా నన్నొక పెద్దమనిషి పట్టుకొని ఇక్కడేం చేస్తున్నావు పారిపో.. పరుగెత్తు పరుగెత్తు అన్నారు. అప్పుడు నేను భయంతో స్కూల్‌కి పరుగెత్తాను. తొలుత మా టీచర్ కు ఆ తర్వాత ఇంటికి వెళ్లి అమ్మానాన్నకు చెప్పాను’అని వివరించాడు. ప్రశ్న, సమాధానం పద్ధతిలో మొత్తం పద్దెనిమిది ప్రశ్నలు ఈ బాలుడికి పోలీసులు వేశారు. -
దోపిడీ దొంగల బీభత్సం
►నిద్రిస్తున్న మహిళల మెడల్లో ఆభరణాల చోరీ ►బాధితులపై రాళ్లు రువ్విన దుండగులు ►రెండు సంఘటనల్లో 7.4 సవర్లు అపహరణ ►ఒకడిని పట్టుకుని పోలీసులకు అప్పగింత కొండాపురం : చోరీకి వచ్చిన దుండగులు పట్టుబడే పరిస్థితి రావడంతో బీభత్సం సృష్టించిన సంఘటన మండలంలోని తూర్పుఎర్రబల్లి పంచాయతీ మన్నంవారిపల్లెలో బుధవారం రాత్రి 2 గంటల సమయంలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెంవదిన మోదేపల్లి విజయమ్మ కుటుంబ సభ్యులు వేసవికావడంతో బుధవారం రాత్రి ఆరుబయట నిద్రిస్తున్నారు. గుర్తుతెలియని నలుగురు దుండగులు విజయమ్మ అర్ధరాత్రి 2 గంటల సమయంలో మెడలో నాలుగున్నర సవర్ల సరుడు అపహరించా రు.చెవి కమ్మలు తీసేటప్పటికీ మెలుకువ వచ్చిన విజయమ్మ కేకలు పెట్టింది. దీంతో పక్కనే ఉన్న ఆమె కుటుంబ సభ్యులు దొరసానమ్మ, హజరత్తయ్య నిద్ర లేచారు. పారిపోతున్నా దుండగుల్లో ఒక్కడిని అక్కడే కట్టేసి ఉన్న గేదె పొడిచింది. దీంతో దుండగుడు పక్కనే ఉన్న రాళ్ల గుట్టపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించ గా రాళ్లతో దాడిచేసి పరారీ అయ్యారు. ఈ దాడిలో విజయ మ్మ, దొరసానమ్మకు తీవ్రగాయాలయ్యాయి. ఈ అలజడితో నిద్రలేచిన సమీప ఇళ్లల్లోని వ్యక్తులు రాళ్ల దాడిని సైతం లెక్క చేయకుండా దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించగా ఒక్కడు మాత్రం దొరికాడు. మిగిలిన ముగ్గురు చోరీ సొత్తుతో పరారీ అయ్యారు. దొరికిన దుండగుడ్ని పోలీసులకు అప్పగించారు. గాయపడిన విజ యమ్మ, దొరసానమ్మను చికి త్స నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించా రు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దుండగుడ్ని అదుపులోకి తీసుకున్నారు. దుండగుడు గాయపడటంతో చికిత్స నిమిత్తం 108 వాహనలో కావలికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు నలుగురిది వింజమూరుగా గుర్తించారు. వీరిపై ఇప్పటికే జలదంకి, కావలి తదితర ప్రాంతాల్లో చోరీ చేసినట్లు కేసులు ఉన్నాయని ఎస్సై కొండయ్య తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కలిగిరి సీఐ సాంబశివరావు, ఎస్ఐ కొండయ్య ఆసుపత్రికి చేరుకుని బాధితులను కలిసి వివరాలు సేకరించారు. బగాదిపల్లిలో చోరీ మండలంలోని బగాదిపల్లిలో ఆరుబయట నిద్రిస్తున్న ఓ మహిళ మెడలోని 3 సవర్ల బంగారు సరుడును గుర్తుతెలియని దుండగులు చోరీ చేశారు.గ గ్రామానికి చెందిన డేగా ఆదిలక్ష్మమ్మ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం రాత్రి ఆరుబయట నిద్రిస్తుంది. సుమారు 12 గంటల సమయంలో నలుగురుగురు దుండగులు ఆమె మెడలోని నగలు చోరీ చేశారు. దీంతో మెలకువ వచ్చిన ఆమె లేచి కేకలు పెట్టడంతో ఆమెపై రాళ్లు రువ్వి పరారీ అయ్యారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మండలంలోని రెండు గ్రామాల్లో గంటల వ్యవధిలో రెండు చోట్ల దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించడంతో ప్రజలు హడలిపోతున్నారు.