►నిద్రిస్తున్న మహిళల మెడల్లో ఆభరణాల చోరీ
►బాధితులపై రాళ్లు రువ్విన దుండగులు
►రెండు సంఘటనల్లో 7.4 సవర్లు అపహరణ
►ఒకడిని పట్టుకుని పోలీసులకు అప్పగింత
కొండాపురం : చోరీకి వచ్చిన దుండగులు పట్టుబడే పరిస్థితి రావడంతో బీభత్సం సృష్టించిన సంఘటన మండలంలోని తూర్పుఎర్రబల్లి పంచాయతీ మన్నంవారిపల్లెలో బుధవారం రాత్రి 2 గంటల సమయంలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెంవదిన మోదేపల్లి విజయమ్మ కుటుంబ సభ్యులు వేసవికావడంతో బుధవారం రాత్రి ఆరుబయట నిద్రిస్తున్నారు. గుర్తుతెలియని నలుగురు దుండగులు విజయమ్మ అర్ధరాత్రి 2 గంటల సమయంలో మెడలో నాలుగున్నర సవర్ల సరుడు అపహరించా రు.చెవి కమ్మలు తీసేటప్పటికీ మెలుకువ వచ్చిన విజయమ్మ కేకలు పెట్టింది. దీంతో పక్కనే ఉన్న ఆమె కుటుంబ సభ్యులు దొరసానమ్మ, హజరత్తయ్య నిద్ర లేచారు.
పారిపోతున్నా దుండగుల్లో ఒక్కడిని అక్కడే కట్టేసి ఉన్న గేదె పొడిచింది. దీంతో దుండగుడు పక్కనే ఉన్న రాళ్ల గుట్టపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించ గా రాళ్లతో దాడిచేసి పరారీ అయ్యారు. ఈ దాడిలో విజయ మ్మ, దొరసానమ్మకు తీవ్రగాయాలయ్యాయి. ఈ అలజడితో నిద్రలేచిన సమీప ఇళ్లల్లోని వ్యక్తులు రాళ్ల దాడిని సైతం లెక్క చేయకుండా దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించగా ఒక్కడు మాత్రం దొరికాడు. మిగిలిన ముగ్గురు చోరీ సొత్తుతో పరారీ అయ్యారు. దొరికిన దుండగుడ్ని పోలీసులకు అప్పగించారు.
గాయపడిన విజ యమ్మ, దొరసానమ్మను చికి త్స నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించా రు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దుండగుడ్ని అదుపులోకి తీసుకున్నారు. దుండగుడు గాయపడటంతో చికిత్స నిమిత్తం 108 వాహనలో కావలికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు నలుగురిది వింజమూరుగా గుర్తించారు. వీరిపై ఇప్పటికే జలదంకి, కావలి తదితర ప్రాంతాల్లో చోరీ చేసినట్లు కేసులు ఉన్నాయని ఎస్సై కొండయ్య తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కలిగిరి సీఐ సాంబశివరావు, ఎస్‌ఐ కొండయ్య ఆసుపత్రికి చేరుకుని బాధితులను కలిసి వివరాలు సేకరించారు.
బగాదిపల్లిలో చోరీ
మండలంలోని బగాదిపల్లిలో ఆరుబయట నిద్రిస్తున్న ఓ మహిళ మెడలోని 3 సవర్ల బంగారు సరుడును గుర్తుతెలియని దుండగులు చోరీ చేశారు.గ గ్రామానికి చెందిన డేగా ఆదిలక్ష్మమ్మ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం రాత్రి ఆరుబయట నిద్రిస్తుంది. సుమారు 12 గంటల సమయంలో నలుగురుగురు దుండగులు ఆమె మెడలోని నగలు చోరీ చేశారు. దీంతో మెలకువ వచ్చిన ఆమె లేచి కేకలు పెట్టడంతో ఆమెపై రాళ్లు రువ్వి పరారీ అయ్యారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మండలంలోని రెండు గ్రామాల్లో గంటల వ్యవధిలో రెండు చోట్ల దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించడంతో ప్రజలు హడలిపోతున్నారు.
దోపిడీ దొంగల బీభత్సం
Published Fri, May 22 2015 3:29 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement
Advertisement