అక్కను వేధించిన వారికి బుద్ది చెప్పిన మరునాడే.. | UP boy set ablaze for saving his sister from molesting | Sakshi
Sakshi News home page

అక్కను వేధించిన వారికి బుద్ది చెప్పిన మరునాడే..

Published Sun, Sep 25 2016 10:46 AM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM

అక్కను వేధించిన వారికి బుద్ది చెప్పిన మరునాడే..

అక్కను వేధించిన వారికి బుద్ది చెప్పిన మరునాడే..

షహజాన్ పూర్: తన సోదరిని ఏడిపించేందుకు ప్రయత్నించిన జులాయిలను అడ్డుకున్నాడని ఓ పదిహేడేళ్ల యువకుడిపై కిరోసిన్ పోసి నిప్పటించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని షహజన్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం అతడు 50శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్ప పొందుతున్నాడు. సూరజ్ కశ్యప్ అనే యువకుడికి ఓ సోదరి ఉంది. వారిది సౌఫ్రీ అనే గ్రామం. ఈ గ్రామంలో కొంతమంది తాగుబోతు యువకులు వాళ్లింటి ముందు ఫుల్లుగా మద్యం సేవిస్తూ అడ్డగోలిగా అసభ్యంగా మాట్లాడుతుండటంతో కశ్యప్ వచ్చి వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించాడు.

దీంతో వాళ్లు ఇంట్లోకి చొరబడి తన సోదరిని వేధించడం మొదలుపెట్టారు. దీంతో ఆ నలుగురితో యువకుడు పోరాడగా చుట్టుపక్కల వారు కూడా వచ్చి వారిని తరిమికొట్టారు. ఇది మనసులో పెట్టుకున్న వారు అతడు ఒంటరిగా బయటకు వెళుతుండం చూసి కాపుకాసి దాడి చేశారు. బాగా కొట్టి కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement