
సాక్షి, బంజారాహిల్స్: శానిటైజర్ కాలుతుందో.. లేదో చూద్దామని అగ్గిపుల్ల గీసి వేయడంతో మంటలు చెలరేగి ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు...బంజారాహిల్స్ రోడ్ నం.4లోని యానిమల్ కేర్ సెంటర్‌లో వికారాబాద్‌కు చెందిన జె.మొగలప్ప నాలుగేళ్లుగా పని చేస్తున్నాడు. అతనితో పాటు పవన్ ఆఫీస్ బాయ్‌గా పని చేస్తున్నాడు.
ఈ నెల 12న ఇద్దరూ కలిసి ఐదు లీటర్ల శానిటైజర్‌ను ఓ చిన్న డబ్బాలోకి ఒంపుతుండగా, అసలు శానిటైజర్‌కు నిప్పు అంటుకుంటుందా లేదా అని పవన్‌కు అనిపించింది. వెంటనే తన వద్ద ఉన్న అగ్గిపెట్టెను తీసి అగ్గిపుల్లను గీసి శానిటైజర్‌లో వేశాడు. ఒక్కసారి మంటలు చెలరేగి ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డాడు. మొగలప్ప పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీనగర్‌కాలనీ తన్వీర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఫిర్యాదు అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: దోమ తెరలు, బ్లాంకెట్ల సరాఫరా.. 60 కోట్ల కాంట్రాక్ట్ ఇప్పిస్తానని.. )
Comments
Please login to add a commentAdd a comment