న్యూఢిల్లీ: దేశ రాజధానిలో శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 27 మంది దుర్మరణం పాలయ్యారని పోలీసులు తెలిపారు. ఇంకా ఒక ఫ్లోర్‌ను గాలించాల్సి ఉండటంతో మృతుల సంఖ్య పెరగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ఘటనకు సంబంధించి సాయంత్రం 4 నుంచి మూడు గంటలు పాటు ఆ ప్రాంతంలో ఏం జరిగిందని అక్కడి స్థానికలు తెలిపారు.
►మధ్యాహ్నం 1 : ఎప్పటిలానే ఆ బిల్డింగ్‌లో పనులు యధావిధిగా కొనసాగుతున్నాయి. అంతేగాక మొదటి అంతస్తులో ఒక ప్రత్యేక సమావేశం జరుగుతోంది.
►సాయంత్రం 4.30: అకస్మాత్తుగా భవనం మొదటి అంతస్తు నుంచి పొగలు రావడం మొదలయ్యాయి. దీంతో అందులో ఉన్న వారు గందరగోళానికి గురయ్యారు. సిబ్బంది వెంటనే పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. భవనంలో ఉన్న వ్యక్తులు తప్పించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
►సాయంత్రం 4.40-45: వేగంగా వ్యాపిస్తున్న మంటల్లో కొందరు అప్పటికే చిక్కుకుపోయారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని అగ్నిమాపక, సహాయక చర్యలు ప్రారంభించారు.
►సాయంత్రం 4.50: తప్పించుకోవడానికి, వ్యక్తులు కిటికీలను పగలగొట్టి, తాళ్ల సహాయంతో భవనం మొదటి, రెండవ అంతస్తుల నుంచి తప్పించుకునేందుకు దూకడం ప్రారంభించారు. స్థానికుల సహకారంతో పోలీసులు పలువురిని రక్షించారు.
►సాయంత్రం 5: సంఘటనా స్థలానికి మరిన్ని అగ్నిమాపక యంత్రాలు చేరుకుని సహాయక చర్యలు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి.
►సాయంత్రం 6.20: మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అంబులెన్స్‌లు అటు ఇటు తిరుగుతూ క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలిస్తున్నారు.
►రాత్రి 10.50: మంటలను అదుపులోకి తెచ్చి శీతలీకరణ చర్యలు ప్రారంభించారు. ఈ సమయంలో, అగ్నిమాపక దళం మొత్తం 16 మంది మరణించినట్లు నిర్ధారించింది. క్రమంగా ఆ సంఖ్య ఆ తర్వాత మొత్తం 27 మంది మరణించారని డీసీపీ తెలిపారు.
►రాత్రి 11.40: మొదటి అంతస్తులో మళ్లీ ఎగిసిపడిన మంటలను ఆర్పివేశారు.
►తెల్లవారు జామున 2 గంటలకు: శీతలీకరణ పని చివరకు పూర్తయింది.
Comments
Please login to add a commentAdd a comment