Delhi fire department
-
ఢిల్లీ అగ్ని ప్రమాదం.. ఆ మూడు గంటలు ఏం జరిగిందంటే..
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 27 మంది దుర్మరణం పాలయ్యారని పోలీసులు తెలిపారు. ఇంకా ఒక ఫ్లోర్‌ను గాలించాల్సి ఉండటంతో మృతుల సంఖ్య పెరగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ఘటనకు సంబంధించి సాయంత్రం 4 నుంచి మూడు గంటలు పాటు ఆ ప్రాంతంలో ఏం జరిగిందని అక్కడి స్థానికలు తెలిపారు. ►మధ్యాహ్నం 1 : ఎప్పటిలానే ఆ బిల్డింగ్‌లో పనులు యధావిధిగా కొనసాగుతున్నాయి. అంతేగాక మొదటి అంతస్తులో ఒక ప్రత్యేక సమావేశం జరుగుతోంది. ►సాయంత్రం 4.30: అకస్మాత్తుగా భవనం మొదటి అంతస్తు నుంచి పొగలు రావడం మొదలయ్యాయి. దీంతో అందులో ఉన్న వారు గందరగోళానికి గురయ్యారు. సిబ్బంది వెంటనే పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. భవనంలో ఉన్న వ్యక్తులు తప్పించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ►సాయంత్రం 4.40-45: వేగంగా వ్యాపిస్తున్న మంటల్లో కొందరు అప్పటికే చిక్కుకుపోయారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని అగ్నిమాపక, సహాయక చర్యలు ప్రారంభించారు. ►సాయంత్రం 4.50: తప్పించుకోవడానికి, వ్యక్తులు కిటికీలను పగలగొట్టి, తాళ్ల సహాయంతో భవనం మొదటి, రెండవ అంతస్తుల నుంచి తప్పించుకునేందుకు దూకడం ప్రారంభించారు. స్థానికుల సహకారంతో పోలీసులు పలువురిని రక్షించారు. ►సాయంత్రం 5: సంఘటనా స్థలానికి మరిన్ని అగ్నిమాపక యంత్రాలు చేరుకుని సహాయక చర్యలు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. ►సాయంత్రం 6.20: మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అంబులెన్స్‌లు అటు ఇటు తిరుగుతూ క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలిస్తున్నారు. ►రాత్రి 10.50: మంటలను అదుపులోకి తెచ్చి శీతలీకరణ చర్యలు ప్రారంభించారు. ఈ సమయంలో, అగ్నిమాపక దళం మొత్తం 16 మంది మరణించినట్లు నిర్ధారించింది. క్రమంగా ఆ సంఖ్య ఆ తర్వాత మొత్తం 27 మంది మరణించారని డీసీపీ తెలిపారు. ►రాత్రి 11.40: మొదటి అంతస్తులో మళ్లీ ఎగిసిపడిన మంటలను ఆర్పివేశారు. ►తెల్లవారు జామున 2 గంటలకు: శీతలీకరణ పని చివరకు పూర్తయింది. -
అయ్యో భగవంతుడా!.. బతుకులు బుగ్గి చేశావే (ఫోటోలు)
-
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. వెలుగులోకి కీలక అంశాలు
నూఢిల్లీ: దేశ రాజధానిలో శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 27 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం నుంచి 60 నుంచి 70 మందిని రక్షించామని, సుమారు 40 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఇంకా ఒక ఫ్లోర్‌ను గాలించాల్సి ఉండటంతో మృతుల సంఖ్య పెరగవచ్చని చెప్పారు. కాగా ఈ ఘటనకు సంబంధించి కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. కీలక అంశాలు.. ► మొదటి అంతస్తులో ఉన్న సీసీటీవీ కెమెరాలు, రూటర్ల తయారీ కంపెనీ కార్యాలయంలో మంటలు చెలరేగాయని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సమీర్ శర్మ తెలిపారు. ► భవనంలో అగ్ని ప్రమాదం జరిగిన కాసేపటి పొగలు భవనం మొత్తం వ్యాపించాయి. దీంతో కొంతమంది తమను తాము రక్షించుకోవడానికి కిటికీలోంచి కిందకి దూకేశారని, మరికొందరు కిందకి దిగడానికి తాళ్లను ఉపయోగించిన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో కొందరికి గాయాలు కాగా మరికొందరు మృతి చెందారు. ► భవనానికి అగ్నిమాపక శాఖ నుంచి ఎటువంటి సేఫ్టీ క్లియరెన్స్ లేదు. ఆ బిల్డింగ్ యజమాని మనీష్ లక్రాగా గుర్తించారు. ఈ ఘటన తర్వాత అతను పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం చోటు చేసుకున్న కంపెనీ యజమానులు హరీష్ గోయెల్, వరుణ్ గోయెల్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ►మంటలు చెలరేగినప్పుడు రెండవ అంతస్తులో మోటివేషన్ స్పీచ్ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కారణమిదే కావొచ్చని అగ్నిమాపక సిబ్బంది చెప్తున్నారు. ఈ అంతస్తులో నుంచి మృతుల సంఖ్య మరింత బయటపడొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ►కేవలం ఒక మెట్లు ద్వారం మాత్రమే ఉన్నందున ప్రజలు భవనం నుంచి తప్పించుకోలేకపోయారని అగ్ని మాపక శాఖ డివిజనల్ అధికారి తెలిపారు. ►అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సాయంత్రం 4.40 గంటలకు మంటలు చెలరేగినట్లు సమాచారం అందడంతో 24 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందకు తీవ్రంగా శ్రమించాయి. ►బాధితుల గుర్తింపు గురించి పోలీసులు ఇంకా వివరాలు పంచుకోలేదు. ఘటనలో గాయపడిని వారిని సంజయ్ గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. భవనం నుండి కనీసం 60 మందిని రక్షించారని, మరికొందరు ఇంకా లోపల చిక్కుకున్నారని పోలీసులు తెలిపారు. ►అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేలు పరిహారం ప్రకటించారు. చదవండి: Delhi Fire Accident: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం -
ఢిల్లీ ప్రమాదంలో 29 మంది గల్లంతు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలో శుక్రవారం సంభవించిన ఘోర అగ్నిప్రమాద ఘటనలో 29 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన 27 మందిలో ఏడుగురిని ఇప్పటివరకు గుర్తించారు. మంటలను ఆర్పిన అనంతరం శనివారం ఉదయం భవనంలో మాడిమసైన మృతదేహ భాగాలను ఫోరెన్సిక్ నిపుణులు సేకరించారు. దీంతో, మృతుల సంఖ్య 30కు చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. క్షతగాత్రులైన మరో 12 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భవనంలో పూర్తి స్థాయి గాలింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో ఆ భవనంలోకి వేర్వేరు పనుల నిమిత్తం వచ్చి గల్లంతైనట్లు భావిస్తున్న 29 మంది ఆచూకీ కోసం వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిగా కాలిన స్థితిలో ఉన్న మృతదేహాల గుర్తింపు సాధ్యంకాని సందర్భాల్లో డీఎన్ఏ పరీక్షలు జరిపిస్తామని పోలీసులు తెలిపారు. మిస్సయిన 24 మంది మహిళలు సహా మొత్తం 29 మంది జాబితాను పోలీసులు తయారు చేశారు. కాగా, ప్రమాదం చోటుచేసుకున్న నాలుగంతస్తుల భవనానికి ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ లేదు. భవనం మొత్తానికి ఒకే గేట్ ఉన్న కారణంగా మరణాలు పెరిగాయని చీఫ్ ఫైర్ ఆఫీసర్ అతుల్ గార్గ్ వెల్లడించారు. ఏసీ యంత్రం పేలుడు కారణంగానే మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నామన్నారు. అయితే, ఒకటో అంతస్తులోని సీసీటీవీ కెమెరా ఉత్పత్తి యూనిట్లో మంటలు మొదలయ్యాయనే అనుమానంతో ఆ యూనిట్ యజమానులైన హరీశ్ గోయెల్, వరుణ్ గోయెల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ సమీర్ శర్మ తెలిపారు. భవనంలోని నాలుగంతస్తులను వీరి కంపెనీయే వాడుకుంటోందని, వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టామని అన్నారు. భవన యజమాని మనీశ్ లక్రాపైనే కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కాగా, ప్రమాద ఘటనపై మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశించినట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు. శనివారం ఆయన ఘటనాస్థలిని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున అందజేస్తామన్నారు. -
అతి భయంకరమైన సంఘటన: ప్రధాని
సాక్షి, న్యూఢిల్లీ : అగ్ని ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఆదివారం ఉదయం సంఘటనా స్థలాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ...‘అగ్నిప్రమాదంలో 43మంది అమాయకులు మృతి చెందారు. చనిపోయినవారి ప్రాణాలు తెచ్చివ్వలేం. అయితే ఢిల్లీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, గాయపడ్డవారికి రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తోంది’ అని తెలిపారు. చదవండి: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం, 43మంది మృతి! మరోవైపు ఈ ప్రమాదంలో గాయపడి లోక్‌నాయక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని ముఖ్యమంత్రి పరామర్శించారు. ఈ ప్రమాదంలో సుమారు 15మంది గాయపడ్డారని, క్షతగాత్రుల్లో ఒకరికి 50శాతం గాయాలు అయ్యాయని, మిగతా ఎనిమిది మంది దట్టమైన పొగ పీల్చడం కారణంగా అస్వస్థతకు గురైనట్లు చెప్పారు. ఈ ప్రమాదంపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి, వారంలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. బాధ్యులను ఉపేక్షించేది లేదని సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అతి భయంకరమైన సంఘటన: ప్రధాని మరోవైపు ఈ ఘోర అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'అతి భయంకర సంఘటన నన్ను తీవ్రంగా బాధించింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా' అనిప్రధాని ట్వీట్ చేశారు. సహాయక చర్యలకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అలాగే మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయనిధి కింద రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.50వేలు తక్షణ సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. భవన యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా ఢిల్లీలోని రాణి ఝాన్సీ రోడ్డులో ఓ ఫ్యాక్టరీలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకూ 43మంది మృతి చెందారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఫ్యాక్టరీలో కార్మికులంతా నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు భవనం యజమాని మహ్మద్ రెహన్‌పై ఐపీసీ సెక్షన్ 304 కింద ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉండగా, యజమాని సోదరుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది 30 ఫైర్ ఇంజన్లను ఉపయోగించారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. -
అగ్నిమాపక శాఖకు ఫోన్ కాల్స్ వెల్లువ
సాక్షి, న్యూఢిల్లీ : నగర అగ్నిమాపక శాఖకు దీపావళినాటి రాత్రి 293 కాల్స్ వచ్చాయి. గత ఐదేళ్లలో ఇన్ని కాల్స్ రాలేదని సంబంధిత అధికారులు శుక్రవారం తెలిపారు. దీపావళి రోజు సాయంత్రం మొదలుకుని శుక్రవారం ఉదయం ఏడుగంటల వరకు మొత్తం 293 కాల్స్ వచ్చాయన్నారు. వాటిలో 55 కాల్స్ బాణాసంచావల్ల జరిగిన అగ్నిప్రమాదాలకు సంబంధించినవన్నారు. రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్య తమకు అత్యధికంగా 37 కాల్స్ వచ్చాయని, రాత్రి 12 గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు 73 వచ్చాయన్నారు. సాధారణంగా దీపావళి రోజు సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్య ఎక్కువ కాల్స్ వచ్చేవన్నారు. ఈ సంవత్సరం మాత్రం ఈ సమయంలో తక్కువగా వచ్చాయన్నారు. అగ్నిపమాదాల్లో ఎటువంటి ప్రాణనష్టమూ లేదని, మంటలను ఆర్పే ప్రయత్నంలో తమ విభాగానికి చెందిన ఇద్దరు సిబ్బంది గాయపడ్డారని మరో అధికారి చెప్పారు. దక్షిణ ఢిల్లీలోని ఓఖ్లాలో ఓ చిన్న దుకాణంలో చెలరేగిన మంటలను ఆర్పుతుండగా గాయపడినట్లు చెప్పారు. సిలిండర్ పేలుడు వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ఆయన తెలిపారు.గాయపడిన ఇద్దరు ఉద్యోగులను చికిత్స కోసం సఫ్ధర్ జంగ్ ఆస్పత్రికి తరలించామని, వారి ఆరోగ్య పరిస్థితి మెరుగైందని ఆయన తెలిపారు. దీపావళి రోజున డీఎఫ్‌ఎస్‌కు చెందిన మూడు వేల మంది ఉద్యోగుల్లో 1,800 మంది విధుల్లోఉన్నారు. మంటలను ఆర్పడం కోసం 180 వాహనాలను మోహరించారు. సేవల సమన్వయం కోసం 25 నుంచి 30 వాహనాలను వినియోగించారు.కాశ్మీర్ గేట్ వద్ద కారు విడిభాగాలమార్కెట్లో జరిగిన అగ్నిప్రమాదం గురువారం నాటి ప్రమాదాలనంటిలోనూ పెద్దది. ఓ మూడంతస్తుల భవనంలో చె లరేగిన మంటలను ఆర్పడం కోసం అగ్నిమాపక శాఖసిబ్బంది మూడు గంటలపాటు శ్రమించారు. దీపావళి పూజ అనంతరం యజమానులు దీపాలు ఆరిపోకముందే దుకాణాలు మూసి వెళ్లిపోయారు. అవి పెద్దఎత్తున అంటుకుని మంటలు భవనం కింద అంతస్తు నుంచి మూడో అంతస్తు వరకు వ్యాపించాయి. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.