Fire accident at Gladiator sequel, crew members injured in stunt sequence on set - Sakshi
Sakshi News home page

Gladiator Movie: గ్లాడియేటర్‌ సెట్‌లో అగ్ని ప్రమాదం.. ఆరుగురికి తీవ్రగాయాలు!

Published Sun, Jun 11 2023 4:48 PM | Last Updated on Sun, Jun 11 2023 5:05 PM

Fire Accident at Gladiator Movie sequel Shooting Set Several Injured - Sakshi

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసే చిత్రాల్లో గ్లాడియేటర్ సిరీస్ ఒకటి. గతంలో విడుదలైన గ్లాడియేటర్-1 సినీ ప్రేక్షకులను కట్టిపడేసింది. భారీ యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.  అయితే ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్‌గా గ్లాడియేటర్-2 తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా సెట్‌లో ఊహించని విధంగా అగ్ని ప్రమాదం జరిగింది.

( ఇది చదవండి: తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.. ఆదిపురుష్ హీరోయిన్)

ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ మొరాకోలో జరుగుతోంది. ఈ ప్రమాదం వల్ల పలువురు సిబ్బంది గాయపడినట్లు చిత్ర నిర్మాణ సంస్థ పారామౌంట్ పిక్చర్స్ ప్రతినిధి వెల్లడించారు. 

ఆయన మాట్లాడుతూ..'ఈ ప్రమాదంలో ఆనుగురు సిబ్బందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నాం. ఇప్పటికే ఆరుగురు సిబ్బందిలో మరో నలుగురికి చికిత్స కొనసాగుతోంది. ఇంతటి భారీ అగ్నిప్రమాదం ఎప్పుడూ చూడలేదు. షూటింగ్‌ సెట్‌లో భద్రతా పరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.' అని తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో నటీనటులకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఆయన వెల్లడించారు. 

కాగా.. 2000 సంవత్సరంలో వచ్చిన ‘గ్లాడియేటర్‌’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. సర్ రిడ్లీ స్కాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదు ఏకంగా 5 ఆస్కార్‌ అవార్డులు సొంతం చేసుకుంది. 23 ఏళ్ల తర్వాత ఈ సినిమా సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. ఈ మూవీ నవంబర్ 2024లో విడుదల కానుంది.

( ఇది చదవండి: కొత్తింట్లోకి అడుగు పెట్టిన హిమజ, ఫోటో వైరల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement