moracco
-
ఈ సంగతి విన్నారా! ఒకే కాన్పులో.. 'నైన్ ఆల్ ఫైన్'..!!
సాధారణంగా మనం ఎన్నో వింటుంటాం, చూసుంటాం. వింతలైనా, విశేషాలైనా, మరేవైనా కావచ్చు. అలాగే ఇక్కడ కూడా అవాకయ్యేలాగా ఓ అద్భుతం జరిగింది. ఇంతకీ అది అద్భుతమేనా? ముమ్మాటికీ అవుననే చెప్పవచ్చు. అదే.. ఈ 'ఒకే కాన్పులో తొమ్మిది మంది పుట్టడం.. అదీ బతికి బట్టకట్టడం' ఎప్పుడైనా చూశారా? మరెందుకు ఆలస్యం.. ఇప్పుడే చూసేయండి. చూశారుగా.. అందరూ ఎంత చలాకీగా ఉన్నారో..! ఒకే కాన్పులో పుట్టి జీవించి ఉన్న తొలి 9 మంది కవలలు (నోనుట్లెట్స్) వీరు!! మొత్తం ఐదుగురు అక్కాచెల్లెళ్లు, నలుగురు అన్నదమ్ములు! దీనికి సంబంధించి గిన్నిస్ రికార్డు కూడా సాధించారు. ఈ నవ సోదరసోదరీమణులకు ఓ ఆరేళ్ల అక్క కూడా ఉందండోయ్! అంటే సంతానం టోటల్ టెన్ అన్నమాట. మాలి దేశానికి చెందిన హలీమా సిస్చే, అబ్జెల్కాదెర్ ఆర్బీ అనే దంపతులకు 2021 మే 4న ఈ తొమ్మిది మంది మొరాకోలో జన్మించారు. అత్యంత అరుదైన కేసు కావడంతో డెలివరీ నిమిత్తం హలీమాను మాలి ప్రభుత్వం ప్రత్యేక వైద్య సదుపాయాలున్న మొరాకోలోని ఓ ఆస్పత్రికి పంపింది. కొన్ని ఆరోగ్యపరమైన సమస్యల వల్ల తల్లికి ముందుగానే.. 30 వారాల గర్భం సమయంలోనే వైద్యులు సిజేరియన్ చేశారు. ఫ్రీ డెలివరీ కావడంతో ఒక్కొక్కరి బరువు కేవలం అరకిలో నుంచి కిలో మధ్య ఉంది. దీంతో పిల్లలు 10 నెలలపాటు ఇంక్యుబేటర్లు, ప్రత్యేక వసతులున్న కేంద్రంలో గడపాల్సి వచ్చింది. మరో రెండు నెలల్లో మూడో పుట్టినరోజు జరుపుకోనున్న వీరంతా ఇప్పుడు తమ ఇంటి గడపదాటి.. గిన్నిస్ చానల్ కార్యక్రమంలో సందడి చేసేందుకు తొలిసారి ఇటలీ పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో వీరి ఫొటోలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు విడుదల చేశారు. ఇవి చదవండి: ఆయుష్షులో సెంచరీ కొట్టి.. గిన్నిస్ రికార్డు కెక్కిన వృద్ధుడు! -
షూటింగ్ సెట్లో భారీ అగ్ని ప్రమాదం.. సిబ్బందికి తీవ్రగాయాలు!
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసే చిత్రాల్లో గ్లాడియేటర్ సిరీస్ ఒకటి. గతంలో విడుదలైన గ్లాడియేటర్-1 సినీ ప్రేక్షకులను కట్టిపడేసింది. భారీ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్‌గా గ్లాడియేటర్-2 తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా సెట్లో ఊహించని విధంగా అగ్ని ప్రమాదం జరిగింది. ( ఇది చదవండి: తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.. ఆదిపురుష్ హీరోయిన్) ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మొరాకోలో జరుగుతోంది. ఈ ప్రమాదం వల్ల పలువురు సిబ్బంది గాయపడినట్లు చిత్ర నిర్మాణ సంస్థ పారామౌంట్ పిక్చర్స్ ప్రతినిధి వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ..'ఈ ప్రమాదంలో ఆనుగురు సిబ్బందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నాం. ఇప్పటికే ఆరుగురు సిబ్బందిలో మరో నలుగురికి చికిత్స కొనసాగుతోంది. ఇంతటి భారీ అగ్నిప్రమాదం ఎప్పుడూ చూడలేదు. షూటింగ్ సెట్లో భద్రతా పరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.' అని తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో నటీనటులకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఆయన వెల్లడించారు. కాగా.. 2000 సంవత్సరంలో వచ్చిన ‘గ్లాడియేటర్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. సర్ రిడ్లీ స్కాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదు ఏకంగా 5 ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకుంది. 23 ఏళ్ల తర్వాత ఈ సినిమా సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. ఈ మూవీ నవంబర్ 2024లో విడుదల కానుంది. ( ఇది చదవండి: కొత్తింట్లోకి అడుగు పెట్టిన హిమజ, ఫోటో వైరల్) -
అవినాశ్ అద్భుతం.. ఎనిమిదోసారి జాతీయ రికార్డు
రబట్ (మొరాకో): వరుసగా కొత్త జాతీయ రికార్డులతో సత్తా చాటుతున్న భారత అథ్లెట్ అవినాశ్ సబ్లే మరో అరుదైన ఘనతను సాధించాడు. అథ్లెటిక్స్ ప్రపంచంలో ప్రతిష్టాత్మక ఈవెంట్‌గా గుర్తింపు ఉన్న డైమండ్ లీగ్‌లో అతను ఐదో స్థానంలో నిలిచాడు. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో అతను 8 నిమిషాల 12.48 సెకన్లలో గమ్యం చేరాడు. ఇది భారత్ తరఫున కొత్త జాతీయ రికార్డు. గత మార్చిలో తానే నమోదు చేసిన 8 నిమిషాల 16.21 సెకన్ల టైమింగ్‌ను దాదాపు మూడు సెకన్ల తేడాతో అవినాశ్ సవరించాడు. ఏకంగా ఎనిమిదిసార్లు అతను తన జాతీయ రికార్డులనే బద్దలు కొడుతూ కొత్త రికార్డులు నెలకొల్పడం విశేషం. గత నెలలో 5000 మీటర్ల పరుగును 13 నిమిషాల 25.65 సెకన్లలో పూర్తి చేసిన అవినాశ్... 30 ఏళ్లనాటి బహదూర్ ప్రసాద్ రికార్డు (13 నిమిషాల 29.70 సెకన్లు)ను తుడిచేశాడు. తాజా ఈవెంట్లో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత సూఫినాయ్ బకాలి (7 నిమిషాల 58.28 సెకన్లు)కి స్వర్ణం దక్కింది. చదవండి: Rafael Nadal: ‘సెల్యూట్ ఫరెవర్’.. నాదల్‌పై సచిన్, సెహ్వాగ్ ప్రశంసలు -
బైక్‌పై భారీయాత్రకు సిద్ధమైన స్టార్ హీరో!
నటుడు అజిత్ ఇటీవల తన రాబోయే తమిళ చిత్రం వాలిమై యొక్క హైదరాబాద్ షెడ్యూల్ ను పూర్తీ చేసాడు. తర్వాత తుది షెడ్యూల్ కోసం "వాలిమై" చిత్ర బృందం మొరాకోకు వెళ్లనున్నారు. ఈ గ్యాప్ లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ భారీ బైక్ యాత్రకు సిద్దమయ్యాడు. హీరో అజిత్‌కు బైక్‌లు, రేసింగ్ అంటే ఎంత పిచ్చో మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. వీలైనంత వరకు తను బైక్ ప్రయాణాల వైపే అజిత్ మొగ్గు చూపుతాడు. ఆ మధ్య తాను షూటింగ్ పూర్తీ అయ్యాక తిరుగు ప్రయాణంలో బైక్ మీద హైదరాబాద్ నుంచి చెన్నైకి బయలుదేరిన సంగతి మనకు తెలిసిందే.(చదవండి: అజిత్‌తో ఉన్నది ఎవరో తెలుసా?) తాజాగా ఇప్పుడు అజిత్ చెన్నై నుంచి సిక్కింకు(2400కి.మీ) బైక్‌పై వెళ్లనున్నట్టు సమాచారం. ఈ నెలాఖరుకు చెన్నై తిరిగి రానున్నాడు. సోలోగా 4500 కి.మీ బైక్ యాత్ర చేయాలని అజిత్ ప్లాన్ చేసుకున్నారు. ఈ రోడ్ ట్రిప్‌లో వారణాసి దగ్గర ఒక అభిమానితో దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లీక్ అయిన చిత్రంలో అజిత్ బిఎండబ్ల్యూ బైక్ నడుపుతూ శీతాకాలపు బట్టలు ధరించి కనిపించాడు. ఈ పర్యటన నుండి తిరిగి వచ్చిన తరువాత అతను "వాలిమై" తుది షెడ్యూల్ కోసం మొరాకోకు వెళ్లనున్నారు. చిత్రంలో అజిత్ పోలీస్ పాత్రలో కనిపించనుండగా, ఇందులో కథనాయికగా బాలీవుడ్ నటి హుమా ఖురేషి నటిస్తుంది. టాలీవుడ్ హీరో కార్తికేయ విలన్‌గా కనిపించనున్నారు. -
మధ్యదరాలో 170 మంది జలసమాధి!
ట్రిపోలి: ఉత్తర ఆఫ్రికా నుంచి యూరప్ బయల్దేరిన రెండు పడవలు మధ్యదరా సముద్రంలో మునిగిపోయిన ప్రమాదాల్లో కనీసం 170 మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. అందులో ఒకటి లిబియా తీరంలో మునిగిపోగా, మరొకటి మొరాకో సమీపంలో మరో పడవను ఢీకొట్టి గల్లంతైనట్లు తెలిసింది. లిబియా తీరంలో ప్రమాదానికి గురైన పడవలో 120 మంది ప్రయాణిస్తున్నారని, అందులో ముగ్గురిని ప్రాణాలతో కాపాడినట్లు ఇటలీ నేవీ ప్రకటించింది. మిగతా వారి జాడ తెలియాల్సి ఉందని తెలిపింది. మొరాకో సమీపంలో వేరే పడవ మరో పడవను ఢీకొనడంతో 53 మంది వలసదారులు గల్లంతైనట్లు స్పెయిన్ సహాయక బృందాలు వెల్లడించాయి. ఈ రెండు ప్రమాదాల్లో ఎందరు మృతిచెందారో ఐక్యరాజ్య సమితి శరణార్థుల సంస్థ ధ్రువీకరించాల్సి ఉంది. ఇదిలా ఉండగా, లిబియాకు ఉత్తరంగా ఉన్న జువారా పట్టణంలో ప్రమాదంలో చిక్కుకున్న పడవ నుంచి 47 మందిని కాపాడినట్లు జర్మనీ సహాయక బృందాలు తెలిపాయి. గత ఏడాది మధ్యదరాలో 2 వేల మందికి పైగా వలసదారులు మృతి చెందడమో, గల్లంతవడమో జరిగింది. -
సముద్రంలో ఒంటరిగా 76 రోజులు!
అమెరికాకు చెందిన స్టీవెన్ కల్హాన్ రచయిత, ఫిలాసఫర్, జర్నలిస్ట్, పరిశోధకుడు. నేవల్ ఆర్కిటెక్చర్ చదివిన కల్హాన్ పడవల తయారీలో నిపుణుడు. 1986లో స్పెయిన్‌లో తీరంలో జరిగిన పడవల పోటీల్లో పాల్గొనేందుకు బయల్దేరాడు. అక్కడ పోటీలు జరుగుతుండగా తుపానులో చిక్కుకొని బోటు దెబ్బతిని ఆఫ్రికాలోని మొరాకోకు దగ్గరలో ఉన్న ఓ దీవికి చేరుకున్నాడు. అక్కడ బోటును రిపేరు చేసుకొని తిరిగి అమెరికాకు పయనమయ్యాడు. అప్పటికే బోటులో ఆహారం అయిపోవడంతో చేపలు, పక్షుల్ని పట్టుకొని తింటూ, వర్షాలు పడినపుడు బోటులోని ఓ డబ్బాలో నీళ్లు నిల్వచేసుకుని తాగుతూ 76 రోజుల ఒంటరి ప్రయాణం తర్వాత ఎట్టకేలకు వెస్టిండీస్‌లోని ఓ దీవికి చేరుకున్నాడు. అక్కడ కొందరు స్థానిక జాలర్లు ఈయన్ని రక్షించడంతో తిరిగి అమెరికా చేరుకున్నాడు. సముద్రంలో తాను ఎదుర్కొన్న భయానక పరిస్థితుల గురించి ఆ తర్వాత ఆయన రాసిన అడ్రిఫ్ట్ నవలకు ఎంతో పేరొచ్చింది. అలాగే 2012లో వచ్చిన లైఫ్ ఆఫ్ పై సినిమాలో కొన్ని సంఘటనలకూ స్టీవెన్ అనుభవమే ప్రేరణ. ఆ సినిమాకు ఆయన సహాయకుడిగానూ వ్యవహరించాడు. -
ఫిఫా ప్రపంచకప్: మరో రెండు జట్లు ఔట్
మాస్కో: ఫిఫా ప్రపంచకప్‌లో గ్రూప్ బి నుంచి స్పెయిన్, పోర్చుగల్ నాకౌట్ దశకు చేరుకున్నాయి. సోమవారం గ్రూప్ బిలో భాగంగా జరిగిన రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఎక్సట్రా ఇంజ్యూరీ సమయంలో గోల్ చేసి పోర్చుగల్‌తో మ్యాచ్‌ను ఇరాన్ డ్రాగా ముగించింది. మరో మ్యాచ్‌లో మొరాకాతో జరిగిన మ్యాచ్‌ను స్పెయిన్ 2-2తో డ్రా చేసింది. దీంతో గ్రూప్ దశలో ఒక్క విజయం సాధించని మొరాకోతో పాటు పోర్చుగల్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకున్న ఇరాన్ జట్లు టోర్నీ నుంచి నిష్ర్కమించాయి. ఇప్పటికే గ్రూప్ ఏ నుంచి సౌదీ ఆరేబియా, ఈజిప్ట్ జట్లు టోర్నీ నుంచి నిష్ర్కమించిన విషయం తెలిసిందే. చివరి నిమిషంలో గోల్.. మరో రెండు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుంది.. పోర్చుగల్ గెలుస్తుందనుకున్న తరుణంలో ఇరాన్ జట్టు మాయ చేసింది. పెనాల్డీ రూపంలో వచ్చిన అదృష్టాన్ని ఉపయోగించుకుంది. ఇరాన్ ఆటగాడు కరీమ్ (90+3 నిమిషంలో)గోల్ చేసి మ్యాచ్‌ను 1-1తో డ్రాగా ముగించాడు. అంతకముందు తొలి అర్ధ భాగంలోనే పోర్చుగల్ స్టార్ మిడ్‌ఫీల్డర్ రికార్డో క్వారెస్మా తొలి గోల్(44వ నిమిషంలో) నమోదు చేశాడు. పోర్చుగల్ అటాకింగ్ గేమ్ ఆడతూ గోల్ పోస్ట్‌పై దాడి చేయగా ఇరాన్ రక్షణశ్రేణి సమర్ధవంతంగా అడ్డుకుంది. మ్యాచ్‌లో పోర్చుగల్ 14సార్లు గోల్ కోసం ప్రయత్నించగా, ఇరాన్ ఎనిమిది సార్లు ప్రయత్నించింది. దీంతో గ్రూప్ బిలో రన్నరప్‌గా ఉన్న పోర్చుగల్ నాకౌట్ పోరులో బలమైన ఉరుగ్వేతో తలపడనుంది. గ్రూప్-బి టాపర్ స్పెయిన్ గ్రూప్ బిలో మరో సమరం కూడా డ్రాగానే ముగిసింది. రసవత్తరంగా సాగిన స్పెయిన్, మొరాకో మ్యాచ్ 2-2తో డ్రా అయింది. రెండో అర్థభాగం ముగిసే సరికి 2-1తో ఆధిక్యంలో ఉన్న మొరాకోకు.. ఎక్సట్రా ఇంజ్యూరీ టైమ్‌లో స్పెయిన్ ఆటగాడు ఇయాగో ఆస్పస్ (90+1 నిమిషంలో) గోల్ చేసి మొరాకోకు షాక్ ఇచ్చాడు. అంతకముందు మొరాకో తరుపున ఖలీద్(13వ నిమిషంలో), ఎన్-నెస్రీ(80వ నిమిషంలో) గోల్స్ చేశారు. స్పెయిన్‌కు ఇస్కో(19వ నిమిషంలో)గోల్ అందించాడు. దీంతో ఒక్క విజయం, రెండు డ్రాలతో గ్రూప్ బి టాపర్‌గా స్పెయిన్ నాకౌట్లోకి ఆడుగుపెట్టనుంది. -
ప్రాణాలు పణంగా!
ఎలాగోలా యూరోప్లోకి అడుగుపెట్టాలని శరణార్థులు ప్రాణాలను పణంగా పెట్టి సముద్రాన్ని దాటుతుంటారు. ఎందరో ప్రాణాలు కోల్పోతుంటారు కూడా. అదృష్టవశాత్తు అవతలి ఒడ్డు చేరితే శరణార్థి శిబిరాల్లో తలదాచుకొని... శరణార్థిగా గుర్తింపు పొందడానికి దరఖాస్తు చేసుకొని... అది లభించేదాకా నెలల తరబడి వేచిచూడాలి. ఏదోరకంగా యూరోప్‌లో అడుగుపెట్టాలన్న వీరి ఆరాటాన్ని సొమ్ము చేసుకుంటున్న స్మగ్లర్లు పోలీసులకు చిక్కకుండా వివిధ మార్గాల్లో వీరిని సరిహద్దులు దాటిస్తున్నారు. మొరాకో నుంచి స్పెయిన్‌లోకి ప్రవేశించడానికి కొందరు శరణార్థులు చేసిన సాహసమే ఈ చిత్రాలు. ఒకతను కారు వెనకవైపు బంపర్ కింద తాళ్లు కట్టుకొని వేలాడితే... మరొకతను డ్రైవర్ పక్కనున్న సీటును తొలగించి... అచ్చు కుర్చీలా తాను కూర్చొని పైనుంచి లెదర్ సీట్ కవర్స్ వేసుకున్నాడు. తనిఖీలో చిక్కిన వీరి చిత్రాలను స్పెయిన్ విడుదల చేసింది. -
మాకొక బీచ్ కావాలి...
రాబత్: మొరాకోలోని మహిళలు, ముఖ్యంగా ముస్లిం మహిళలు తమకంటూ ప్రత్యేకమైన బీచ్ కావాలంటూ సామాజిక వెబ్సైట్ ‘ఫేస్బుక్’లో ప్రచారాన్ని మొదలు పెట్టడంతో అక్కడి మగవాళ్లు అగ్గిమీద గుగ్గిళం అవుతున్నారు. ఫేస్‌బుక్‌లోనూ మొరాకో ఫెమినిస్టుల ‘బీచ్’ ప్రచారాన్ని ఉదారవాదులు, సంకుచిత సాంప్రదాయ వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముస్లిం మహిళలు ఎక్స్పోజ్ చేయడం అల్లాను ధిక్కరించడమేనని సాంప్రదాయ వాదులు ఆరోపిస్తుండగా, మహిళల కోసం ఓ బీచ్‌ని ప్రత్యేకంగా రిజర్వ్ చేయడమంటే మగవాళ్ల నుంచి మహిళలను వేరుగా చూడడమేనని, ఇది స్త్రీ, పురుష సమాన హక్కులకు భంగం కలిగిస్తోందని ఉదారవాదులు వాదిస్తున్నారు. రంజాన్ పండుగ తర్వాత మగవాళ్లంతా బీచుల్లో విహరిస్తూ సన్బాత్లను ఎంజాయ్ చేస్తుంటే ముస్లిం మహిళలు మాత్రం ఎందుకు అలా ఎంజాయ్ చేయకూడదని ప్రముఖ ఫెమినిస్ట్ నూర్ అల్హోదా ఫేస్బుక్ ద్వారా ప్రశ్నిస్తున్నారు. స్విమ్ షూట్లో సన్‌బాత్ చేసినంత మాత్రాన అల్లాను ధిక్కరించినట్టుకాదని, మగవాళ్ల ముందు అర్థనగ్నంగా సంచరిస్తేనే అల్లాను ధిక్కరించినట్టు అవుతుందని, అందుకనే తాము ముస్లిం మహిళల కోసం ఓ ప్రత్యేక బీచ్ కావాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. మొరాకోలో సముద్ర తీరం వందలాది మైళ్లు విస్తరించి ఉందని, కొంత భాగాన్ని మహిళకు కేటాయిస్తే కొంపలు మునిగేదేమీ లేదని ఫెమినిస్ట్ నూర్‌కు మద్దతుగా మొరాకోలోని కొన్ని మహిళా సంఘాలు వాదిస్తున్నాయి. స్విమ్ షూట్లు ధరిస్తే బీచుల్లో అమ్మాయిలకు భద్రత ఉండదనే సాంప్రదాయవాదులతో ఆ సంఘాలు వాదిస్తున్నాయి. ఇప్పుడు నిండైన దుస్తులు ధరించి వీధిలోకి వెళితే మాత్రం మగవాళ్ల వేధింపులు లేకుండా పోతున్నాయా? అని అంటున్నాయి. పైగా ఇతర మగవాళ్ల నుంచి కన్నా తండ్రీ, తమ్ముడు, అన్న, ఇతర బంధువుల నుంచే తాము ఎక్కువగా వేధింపులను ఎదొర్కోవాల్సి వస్తుందని ఆరోపిస్తున్నాయి. మొరాకోలో ముస్లిం మహిళల్లో ఆధునికులు యూరప్ దేశాల ప్రభావంతో ఆధునిక దుస్తులు ధరిస్తున్నారు. వీరిపై సంప్రదాయవాదులు కేసులు కూడా పెడుతున్నారు. స్థానిక కోర్టులు ఎలాంటి శిక్షలు విధించకుండా అసభ్య దుస్తులు మాత్రం ధరించవద్దంటూ హెచ్చరికలు చేసి మహిళలను వదిలేస్తున్నాయి. గతంలో ముస్లిం మహిళలు ‘బుర్కినీ’ (నిండైన స్విమ్ షూట్) ధరించడాన్ని అనుమతించేవారు. సాంప్రదాయవాదుల గొడవలతో వాటిపై నిషేధం విధించారు. టర్కీలోని సరిసు బీచ్‌ను గతేడాది ఆగస్టు నెలలో ‘విమెన్ ఓన్లీ’ బీచ్‌గా ప్రకటించారు. అప్పడు సంప్రదాయ వాదుల నుంచి కన్నా ఉదారవాదుల నుంచి ఎక్కువ వ్యతిరేకత వచ్చింది. మగవాళ్ల నుంచి మహిళలను వేరు చేస్తున్నారని, ఇది ఐఎస్ఐస్ విధానమేనంటూ విరుచుకుపడ్డారు. . .