ఈ మధ్యకాలంలో విమానంలో ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించిన ఘటనలు తరుచుగా చోటుచేసుకుంటున్నాయి. ప్రయాణికుల చేష్టలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో తాజాగా మరో ఘటన జరిగింది. అయితే ఈసారి ప్రయాణికురాలైన 10 ఏళ్ల చిన్నారిపై విమనయాన సిబ్బంది హాట్ చాక్లెట్ ఒలకబోసింది. ఈ ప్రమాదంలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.
ఢిల్లీ నుంచి ఫ్రంక్‌ఫర్ట్‌కు వెళ్తున్న విస్తారా విమానంలో ఆగస్టు 11 జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఆసల్యంగా వెలుగులోకి వచ్చాయి. రచనా గుప్తా అనే మహిళా తన కూతురితో కలిసి ఫ్రంక్‌ఫర్ట్‌కు విస్తారా విమానంలో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో చిన్నారి ఓ కప్పు హాట్ చాక్లెట్‌ని ఆర్డర్ చేసింది. దీనిని తీసుకొచ్చిన సిబ్బంది ప్రమాదవశాత్తూ చిన్నారి ఎడమ కాలుపై పడటంతో తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఆమెకు ప్రథమ చికిత్స అందించి, విమానం ల్యాండ్ అయ్యాక అంబులెన్స్ ఏర్పాటు చేసి ఆసుపత్రికి తరలించారు.
ఎయిర్‌హోస్టెస్ తప్పిదం కారణంగాబాలికకు గాయాలైనట్లు గుప్తా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే జరిగిన ఈ పరిణామానికి విమానయాన సంస్థ కనీసం క్షమాపణలు చెప్పలేదని, వైద్య ఖర్చులు కూడా చెల్లించలేదని ఆమె ఆరోపిస్తున్నారు. అంబులెన్స్ బిల్లు 503 యూరోలు, ఆసుపత్రి బిల్లు కూడా మేమే కట్టున్నామని గుప్తా తెలిపారు. అంతేగాక ఈ ఘటన ద్వారా లిస్బన్‌కు వెళ్లాల్సిన తమ కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయ్యామని ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయడానికి ఎయిర్‌లైన్స్ ప్రయత్నించలేదని ఆరోపించారు.
అయితే, తమ బృందాలు కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నాయని, వారిని భారత్‌కు తిరిగి వచ్చేందుకు వీలు కల్పించామని, వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తాయని ఎయిర్‌లైన్ స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి దురదృష్ట ఘటనలు ఎదురవ్వకుండా చూసుకుంటామని తెలిపింది.
చదవండి: మణిపూర్ హింసపై 53 సభ్యులతో సీబీఐ దర్యాప్తు.. బృందంలో 29 మంది మహిళా అధికారులు
Comments
Please login to add a commentAdd a comment