Frankfurt
-
ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఉగాది వేడుకలు
ఫ్రాంక్ఫర్ట్ లోని తెలుగు కమ్యూనిటీలు భారతీయ సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని ప్రదర్శిస్తూ తెలుగు నూతన సంవత్సరం ఉగాది స్ఫూర్తిని సరిహద్దులు దాటించారు. తెలుగు వెలుగు జర్మనీ (టివిజి) నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగు వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయ దుస్తులలో కనిపించి ఉత్సవాలకు తెలుగు శోభను అద్దారు.స్థానిక తెలుగు వారి ప్రతిభను వెలికితీయడానికి, సంస్కృతి చైతన్యాన్ని ప్రదర్శించడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో భారత రాయబారి హరీష్ పర్వతనేని, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా బి.ఎస్. ముబారక్ పాల్గొన్నారు. దాదాపు రోజంతా జరిగిన ఉత్సవాలలో సాయంత్రం నిర్వహించిన మ్యూజికల్ ఫెస్ట్ హైలైట్‌గా నిలిచింది.ఈ సంగీతోత్సవంలో భారతదేశానికి చెందిన ప్రముఖ గాయకులు పృథ్వీ చంద్ర, మనీషా ఎరా బత్ని, ఇతిపాడ్ బ్యాండ్‌కి చెందిన సాకేత్ కొమండూరి ల సంగీత ప్రదర్శనలు ఉత్సవ హోరును శిఖరాలకు చేర్చాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఫ్రాంక్ఫర్ట్ మేయర్ (బర్గర్మీస్టర్) డాక్టర్ నర్గెస్ ఎస్కందారి గ్రున్‌బర్గ్ హాజరయ్యారు. అతిథులలో.. యూరోపా యూనియన్ ఫ్రాంక్ఫర్ట్ చైర్పర్సన్, క్లాస్ క్లిప్, జవ్వాజి గ్రూప్ కంపెనీల ఛైర్మన్, జవాజి, విదేశీ మండలి సభ్యురాలు నందిని తదితరులున్నారు. -
విస్తారా విమానంలో బాలికపై పడిన హాట్ చాక్లెట్.. తీవ్ర గాయాలు
ఈ మధ్యకాలంలో విమానంలో ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించిన ఘటనలు తరుచుగా చోటుచేసుకుంటున్నాయి. ప్రయాణికుల చేష్టలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో తాజాగా మరో ఘటన జరిగింది. అయితే ఈసారి ప్రయాణికురాలైన 10 ఏళ్ల చిన్నారిపై విమనయాన సిబ్బంది హాట్ చాక్లెట్ ఒలకబోసింది. ఈ ప్రమాదంలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఢిల్లీ నుంచి ఫ్రంక్ఫర్ట్కు వెళ్తున్న విస్తారా విమానంలో ఆగస్టు 11 జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఆసల్యంగా వెలుగులోకి వచ్చాయి. రచనా గుప్తా అనే మహిళా తన కూతురితో కలిసి ఫ్రంక్ఫర్ట్కు విస్తారా విమానంలో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో చిన్నారి ఓ కప్పు హాట్ చాక్లెట్‌ని ఆర్డర్ చేసింది. దీనిని తీసుకొచ్చిన సిబ్బంది ప్రమాదవశాత్తూ చిన్నారి ఎడమ కాలుపై పడటంతో తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఆమెకు ప్రథమ చికిత్స అందించి, విమానం ల్యాండ్ అయ్యాక అంబులెన్స్ ఏర్పాటు చేసి ఆసుపత్రికి తరలించారు. ఎయిర్‌హోస్టెస్ తప్పిదం కారణంగాబాలికకు గాయాలైనట్లు గుప్తా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే జరిగిన ఈ పరిణామానికి విమానయాన సంస్థ కనీసం క్షమాపణలు చెప్పలేదని, వైద్య ఖర్చులు కూడా చెల్లించలేదని ఆమె ఆరోపిస్తున్నారు. అంబులెన్స్ బిల్లు 503 యూరోలు, ఆసుపత్రి బిల్లు కూడా మేమే కట్టున్నామని గుప్తా తెలిపారు. అంతేగాక ఈ ఘటన ద్వారా లిస్బన్‌కు వెళ్లాల్సిన తమ కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయ్యామని ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయడానికి ఎయిర్‌లైన్స్ ప్రయత్నించలేదని ఆరోపించారు. అయితే, తమ బృందాలు కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నాయని, వారిని భారత్‌కు తిరిగి వచ్చేందుకు వీలు కల్పించామని, వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తాయని ఎయిర్‌లైన్ స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి దురదృష్ట ఘటనలు ఎదురవ్వకుండా చూసుకుంటామని తెలిపింది. చదవండి: మణిపూర్ హింసపై 53 సభ్యులతో సీబీఐ దర్యాప్తు.. బృందంలో 29 మంది మహిళా అధికారులు -
ఫ్రాంక్ఫర్ట్-హైదరాబాద్ మధ్య లుఫ్తాన్సా విమానాలు
న్యూఢిల్లీ: భారత ఏవియేషన్ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ ఏడాది మరిన్ని కొత్త రూట్లలో ఫ్లయిట్ సర్వీసులను ప్రారంభించ నున్నట్లు యూరప్‌కి చెందిన విమానయాన సంస్థ లుఫ్తాన్సా వెల్లడించింది. ఫ్రాంక్ఫర్ట్ -హైదరాబాద్, మ్యూనిక్-బెంగళూరు రూట్లు వీటిలో ఉంటాయని పేర్కొంది. (ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు) ఫ్రాంక్ఫర్ట్- హైదరాబాద్ మధ్య ఫ్లయిట్లు రాబోయే శీతాకాలంలో ప్రారంభం కాగలవని, నవంబర్ 3న మ్యూనిక్-బెంగళూరు ఫ్లయిట్స్ మొదలవుతాయని సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు హ్యారీ హోమీస్టర్ తెలిపారు. మ్యూనిక్ - బెంగళూరు మధ్య వారానికి మూడు సర్వీసులు ఉంటాయని పేర్కొన్నారు. దాదాపు 90 ఏళ్లుగా భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న లుఫ్తాన్సా గ్రూప్ .. ప్రస్తుతం వారానికి 50 పైగా ఫ్లయిట్ సర్వీసులను నిర్వహిస్తోంది. ఢిల్లీ, ముంబై తదితర నగరాల నుంచి ఫ్రాంక్ఫర్ట్, జ్యూరిక్ వంటి సిటీలకు విమానాలను నడుపుతోంది. (షాపింగ్ మాల్స్ ఆపరేటర్లకు ఈ ఏడాది పండగే!) -
Tokyo Olympics: టోక్యో ఫ్లైట్ మిస్ అయిన రెజ్లర్ వినేష్ ఫోగట్
టోక్యో: ఇండియన్ స్టార్ మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ టోక్యో విమానం మిస్ అయింది. ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లలో ఎన్నో పతకాలు గెలిచిన వినేష్‌పై టోక్యో ఒలింపిక్స్‌లో ఈసారి మంచి అంచనాలు ఉన్నాయి. కాగా 53 కేజీల ఉమెన్ ఫ్రీస్టైల్ కేటగిరీలో పోటీ పడుతున్న వినేష్ ఒలింపిక్స్‌లో కచ్చితంగా గోల్డ్ మెడల్ సాధించగలదనే నమ్మకం ఉంది. అయితే ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి ముందు ఆమె తన కోచ్ వోలెట్ అకోస్‌తో కలిసి మెరుగైన శిక్షణ కోసం హంగేరీ వెళ్లింది. యురోపియన్ యూనియన్ వీసాపై ఒకరోజు ఎక్కువగా ఉంది. కాగా మంగళవారం రాత్రి టోక్యో విమానం ఎక్కడానికి వచ్చిన ఆమెను అధికారులు అడ్డుకున్నారు. తాను ఎక్కాల్సిన విమానం వెళ్లిపోవడంతో వినేష్ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) రంగంలోకి సమస్యను పరిష్కరించింది. పరిష్కారమైనట్లు చెప్పింది. వినేష్ బుధవారం టోక్యో వెళ్తుందని ఐవోఐ స్పష్టం చేసింది. ''వినేష్ ఫోగట్ వీసా గడువు సరిగా చూడలేదు. ఇది కావాలని చేసింది కాదు. ఆమె 90 రోజుల పాటు అక్కడ ఉండాల్సి ఉండగా.. ఆమె ఫ్రాంక్ఫర్ట్ చేసే సరికి 91వ రోజు అయింది'' అని వెల్లడించింది. ఈ విషయాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్లగా వాళ్లు వెంటనే జర్మనీలోని ఇండియన్ కాన్సులేట్‌కు సమాచారాన్ని చేరవేశారు. కాగా మంగళవారం రాత్రి ఫ్రాంక్‌ఫర్ట్‌లోనే ఉన్న వినేష్‌కు మరోసారి ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు చేశారు. -
కాలేయం కలిపింది ఇద్దరినీ..!
కోడ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా పనిచేస్తున్న క్రిస్ డెంప్సీ తన గదిలో కూర్చుని భోజనం చేస్తున్నాడు. ఆ సమయంలో క్రుగర్ సోదరుడు జాక్ తన సోదరి పరిస్థితి గురించి సహోద్యోగులతో చెప్పి బాధపడటం డెంప్సీ విన్నాడు. వెంటనే జాక్ దగ్గరకు వెళ్లి.. కాలేయం ఇవ్వడానికి తాను సిద్ధమని చెప్పాడు. క్రిస్ ఎప్పుడూ క్రుగర్‌ను చూడలేదు. అస్సలు ఆమె ఎవరో కూడా తెలియదు. అయినా సరే తన కాలేయంలో కొంత భాగాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చాడు. ఈ విషయం తెలిసి క్రుగర్ నోట మాట రాలేదు. ఆనందంతో ఆమె కళ్లు తడిసిపోయాయి. 2014 మార్చి 20..ఇల్లినాయీలోని ఫ్రాంక్‌ఫోర్ట్.. 27 ఏళ్ల హీదర్ క్రుగర్ కళ్లలో నుంచి నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఇంక తాను జీవించేది కొన్ని నెలలు మాత్రమే అన్న విషయం అప్పుడే ఆమెకు తెలిసింది. లివర్ కేన్సర్ నాలుగో దశలో ఉంది. వెంటనే కాలేయ మార్పిడి చేస్తే తప్ప ఆమె జీవించే అవకాశం లేదని డాక్టర్లు తేల్చేశారు. లివర్ కోసం తమ పేరు నమోదు చేసుకుని ఎదురుచూస్తున్నవారి జాబితా చాంతాడంత ఉంది. అందులో తన వంతు వచ్చేసరికి ఎన్నాళ్లు పడుతుందో తెలియదు. ఇక మిగిలి ఉన్న అవకాశం ఎవరిదైనా కాలేయంలోని కొంత భాగాన్ని తీసి క్రుగర్కు అమర్చడమే. కానీ అందుకు ఎవరు ముందుకు వస్తారు? ‘ఇక కొన్ని రోజుల్లో నా జీవితం ముగిసిపోనుంది. ఆ విషయం ఊహిస్తేనే చాలా భయంగా ఉంది’ అంటూ వణుకుతున్న చేతులతో క్రుగర్ తన డైరీలో రాసుకుంది. 2016 అక్టోబర్ 5..ఇల్లినాయీలోని ఫ్రాంక్‌ఫోర్ట్.. తెల్లని పెళ్లి గౌనులో క్రుగర్ మెరిసిపోతోంది. ఆమె మోములో చిరునవ్వు తాండవిస్తోంది. పక్కనే సూటులో క్రిస్.. బంధుమిత్రుల సమక్షంలో ఇద్దరూ ఒక్కటయ్యారు. ‘నా జీవితంలో నేను చూసిన అద్భుతమైన వ్యక్తివి నువ్వు.. నా నవ్వుకు, ఆనందానికి కారణం నువ్వు.. మూతపడబోయిన నా కనులకు మళ్లీ కలలు కనే అవకాశం కల్పించిందీ నువ్వే.. ఈ నవ్వు, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉండాలి’ అంటూ డైరీలో రాసుకుంది. -
జర్మనీలో అగంతకుడి కలకలం
* థియేటర్లో ప్రేక్షకుల బందీకి యత్నం * మట్టుబెట్టిన భద్రతా బలగాలు ఫ్రాంక్ఫర్ట్: జర్మనీలోని వీర్నెమ్ పట్టణంలో థియేటర్లో దాడికి ఓ అగంతక సాయుధుడు ప్రయత్నించటం కలకలం రేపింది. పోలీసులు చురుకుగా వ్యవహరించి.. కొద్ది సేపట్లోనే ఆ వ్యక్తిని మట్టుపెట్టడంతో ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం ఉదయం జర్మనీ ముఖ్యపట్టణమైన ఫ్రాంక్‌ఫర్ట్‌కు సమీపంలోని వీర్నెమ్లోని ఓ మల్టీప్లెక్స్‌లోకి ప్రవేశించిన ఓ సాయుధుడు.. లోపలినుంచి గడియ పెట్టుకుని అక్కడున్న ప్రేక్షకులను బందీలుగా చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి టియర్ గ్యాస్ ప్రయోగించి.. థియేటర్లోకి ప్రవేశించాయి. భద్రతా బలగాలు, ఆ ఉగ్రవాదికి కాసేపు ఘర్షణ జరిగింది. అనంతరం.. చాకచక్యంగా వ్యవహరించిన బలగాలు అగంతకుడిని మట్టుబెట్టాయి. ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలు, ఈ దాడి యత్నానికి కారణమేంటనే విషయం తెలియరాలేదు. అయితే ఈ ఘటనలో పదుల సంఖ్యలో గాయపడ్డారని తొలుత వార్తలొచ్చినా.. ప్రేక్షకులందరూ క్షేమంగా ఉన్నారని పోలీసులు స్పష్టం చేశారు. అమెరికాలోని ఒర్లాండోలో జరిగిన ఉగ్ర ఘటన మరువకముందే.. మరోసారి సాయుధుడు థియేటర్లో ప్రవేశించాడన్న వార్తలు ప్రజలకు భయభ్రాంతులకు గురిచేశాయి. -
మూడు గంటలు ప్రయాణించి వెనక్కి!
ఎయిర్ ఇండియా విమాన పైలట్ నిర్వాకం న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం నుంచి గంట ఆలస్యంగా జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం మూడుగంటలపాటు ప్రయాణించిన తర్వాత తిరిగి వెనక్కి వచ్చింది. ఎయిరిండియా ప్రతినిధుల వివరాల ప్రకారం... ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం (ఏఐ 121) శనివారం మధ్యాహ్నం 1.45 గంటలకు 200 మంది ప్రయాణికులతో షెడ్యూలు కంటే గంట ఆలస్యంగా ఫ్రాంక్‌ఫర్ట్‌కు బయలుదేరింది. తర్వాత మూడు గంటలపాటు గాలిలో ప్రయాణించిన తర్వాత మిగతా ప్రయాణ సమయంపై లెక్కలు వేసుకున్న పైలట్ కంగుతిన్నాడు. ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయానికి నైట్ కర్ఫ్యూ(రాత్రిపూట ప్రవేశం ఉండదు) సమయంలోగా చేరుకోవడం సాధ్యం కాదని, ఆ తర్వాత అక్కడికి చేరినా విమానాన్ని దింపడం కుదరని గ్రహించాడు. అలాగే విమానం ఆలస్యం అయినందున ఒక పైలట్‌కు పరిమితి ఉన్న డ్యూటీ సమయం కూడా మించిపోతుందని గుర్తించాడు.ఇక చేసేదేమీ లేక విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించాడు. దీంతో అసలే ఆలస్యం.. ఆపై సగందూరం వెళ్లి వెనక్కి వచ్చేసరికి ప్రయాణికులంతా ఉసూరుమన్నారు. కాగా, ప్రయాణికులకు వసతి సౌకర్యాలు కల్పించామని, వారిని ఆదివారం ఉదయం మరో విమానంలో ఫ్రాంక్‌ఫర్ట్‌కు పంపుతామని ఎయిరిండియా వర్గాలు తెలిపాయి.