జర్మనీలో అగంతకుడి కలకలం | Germany shooting: man killed after opening fire at cinema in Viernheim | Sakshi
Sakshi News home page

జర్మనీలో అగంతకుడి కలకలం

Published Fri, Jun 24 2016 1:10 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

జర్మనీలో అగంతకుడి కలకలం - Sakshi

జర్మనీలో అగంతకుడి కలకలం

* థియేటర్‌లో ప్రేక్షకుల బందీకి యత్నం  
* మట్టుబెట్టిన భద్రతా బలగాలు

ఫ్రాంక్‌ఫర్ట్: జర్మనీలోని వీర్నెమ్ పట్టణంలో థియేటర్లో దాడికి ఓ అగంతక సాయుధుడు ప్రయత్నించటం కలకలం రేపింది. పోలీసులు చురుకుగా వ్యవహరించి.. కొద్ది సేపట్లోనే ఆ వ్యక్తిని మట్టుపెట్టడంతో ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం ఉదయం జర్మనీ ముఖ్యపట్టణమైన ఫ్రాంక్‌ఫర్ట్‌కు సమీపంలోని వీర్నెమ్‌లోని ఓ మల్టీప్లెక్స్‌లోకి ప్రవేశించిన ఓ సాయుధుడు..

లోపలినుంచి గడియ పెట్టుకుని అక్కడున్న ప్రేక్షకులను బందీలుగా చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి టియర్ గ్యాస్ ప్రయోగించి.. థియేటర్లోకి ప్రవేశించాయి. భద్రతా బలగాలు, ఆ ఉగ్రవాదికి కాసేపు ఘర్షణ జరిగింది. అనంతరం.. చాకచక్యంగా వ్యవహరించిన బలగాలు అగంతకుడిని మట్టుబెట్టాయి.

ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలు, ఈ దాడి యత్నానికి కారణమేంటనే విషయం తెలియరాలేదు. అయితే ఈ ఘటనలో పదుల సంఖ్యలో గాయపడ్డారని తొలుత వార్తలొచ్చినా.. ప్రేక్షకులందరూ క్షేమంగా ఉన్నారని పోలీసులు స్పష్టం చేశారు. అమెరికాలోని ఒర్లాండోలో జరిగిన ఉగ్ర ఘటన మరువకముందే.. మరోసారి సాయుధుడు థియేటర్లో ప్రవేశించాడన్న వార్తలు ప్రజలకు భయభ్రాంతులకు గురిచేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement