ప్రతీకాత్మక చిత్రం
లక్నో : ఫైజాబాద్ కోర్టుపై 2007లో జరిగిన బాంబు దాడి కేసులో కోర్టు శుక్రవారం ఇద్దరు దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మరొకరిని సాక్ష్యాలు లేని కారణంగా వదిలేసింది. వివరాల్లోకెళితే.. 2007లో ఫైజాబాద్, లక్నో, వారణాసిలలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఫైజాబాద్‌లో కోర్టులో పేలుళ్లు జరుగగా, నలుగురు చనిపోయారు. 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈకేసులో 12 ఏళ్ల విచారణ తర్వాత తీర్పు వెలువడగా, ఇద్దరు ఉగ్రవాదులు మహమ్మద్ తారిక్, మహమ్మద్ అక్తర్‌లకు శిక్ష విధిస్తూ, ఇద్దరికీ చెరో రూ. 50 వేలు జరిమానా విధించింది.
Comments
Please login to add a commentAdd a comment