వీడియో కాన్ఫెరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ లోకేష్‌కుమార్, ఐటీడీఏ పీఓ, ఓఎస్డీ
- ‘విదేశీ వ్యవహారాల’ వీసీలో వెల్లడి
భద్రాచలం: దేశంలో 35 తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలను గుర్తించగా..అందులో తెలంగాణ రాష్ట్రం నుంచి ఖమ్మం జిల్లా కూడా ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎన్‌ఐసీ ఢిల్లీ డైరెక్టర్ ఆనంద్ జైన్ ప్రకటించారు. బుధవారం వీడియో కాన్ఫెరెన్స్‌లో కలెక్టర్ లోకేష్ కుమార్, ఐటీడీఏ పీఓ రాజీవ్ గాంధీ హనుమంతు, ఓఎస్‌డీ భాస్కరన్ భద్రాచలంలో హాజరయ్యారు. నేషనల్ ఇన్ఫర్‌మేషన్ కేంద్రంకు ఖమ్మం జిల్లాలోని తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామాల సమాచారాన్ని జీఐఎన్ సిస్టమ్ ద్వారా వెబ్‌సైట్‌లో పొందుపర్చేందుకు చర్చించారు. జిల్లా నుంచి తీవ్రవాద ప్రభావిత గ్రామాల భౌగోళిక సమాచారంలో భాగంగా ఫోస్టాఫీస్‌లు, బ్యాంకులు, ఏటీఎమ్‌లు, బ్యాంకు మిత్రా, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ కేంద్రాలు, టెలికం కార్యాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రజా పంపిణీ సంస్థలు, పోలీసు స్టేషన్లు, రోడ్లు, బ్రిడ్జిలకు సంబంధించిన సమాచారం జీఐఎస్ ప్రాజెక్టు క్రింద వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఈఈ శంకర్, ఎస్వో డెవిడ్‌రాజ్, గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.