Woman Burns Her Face Following Viral TikTok Recipe At Home - Sakshi
Sakshi News home page

కొంపముంచిన టిక్‌టాక్ రెసిపీ.. దెబ్బకు ముఖం వాచిపోయింది!

Published Wed, May 31 2023 3:45 PM | Last Updated on Wed, May 31 2023 4:21 PM

Woman Burns Her Face Following Viral TikTok Recipe At Home - Sakshi

టిక్‌టాక్‌లో నెటిజన్ల మనసు దోచేయడానికి రకరకాల వీడియోలు చేస్తుంటారు. సరికొత్త రీల్స్‌తో ఫేమస్ అయిపోవాలని చూస్తుంటారు. ఈ విధంగానే ట్రై చేసిన టిక్‌టాక్ రీల్ ఓ మహిళ కొంపముంచింది. ఓ రెసిపీ కోసం రీల్ చేసే క్రమంలో ఆమె ముఖం కాలిపోయింది. అందమైన ఆవిడ ముఖం బొబ్బలతో నిండిపోయింది.  'జీవితంలో ఎదుర్కొన్న విపరీతమైన నొప్పి' అనే క్యాప్షన్‌తో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఆవిడ పేరు షాఫియా బషీర్(37). టిక్‌టాక్‌లో జనాలను అట్రాక్ట్‌ చేసేందుకు ప్రత్యేకమైన వంటకం వీడియో తీయాలనుకుంది. ఈ క్రమంలో గుడ్లను మైక్రోవేవ్‌లో ఉడకబెట్టింది. ఆ తర్వాత బాగా ఉడికిన గుడ్లను బయటకు తీయాలనుకుంది. అందుకు చల్లని చెంచాను మైక్రోవేవ్‌లో పెట్టింది. అంతే.. అందులో ఉన్న వేడి నీరు ఒక్కసారిగా ఆమె  ముఖం మీద పడ్డాయి. వెంటనే చల్లని నీటిలో ముఖం పెట్టినప్పటికీ.. తీవ్ర గాయాలయ్యాయి. ముఖమంతా బొబ్బలు వచ్చాయి. ఇంకేముంది ఆ తర్వాత ఆస్పత్రిలో జాయిన్‌ అయ్యింది.

ఒంటరి మహిళ అయినందున చాలా ఖాళీ సమయం దొరుకుతుందని.. ఆ క్రమంలో టిక్‌టాక్‍లో వంటల వీడియోలు చేస్తుంటానని చెప్పింది. అయితే ప్రస‍్తుతం గాయం నుంచి కొలుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ ఘటన తన జీవితంలో విపరీతమైన నొప్పిని కలిగించిందని తెలిపింది. టిక్‌టాక్‌ వీడియోలు చేసే క్రమంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

చదవం‍డి:‘ఏడాది పాటు షిప్పు ప్రయాణం’.. డబ్బు కట్టి గొల్లుమంటున్న జనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement