face burn
-
కొంపముంచిన టిక్‌టాక్ రెసిపీ.. దెబ్బకు ముఖం వాచిపోయింది!
టిక్‌టాక్‌లో నెటిజన్ల మనసు దోచేయడానికి రకరకాల వీడియోలు చేస్తుంటారు. సరికొత్త రీల్స్‌తో ఫేమస్ అయిపోవాలని చూస్తుంటారు. ఈ విధంగానే ట్రై చేసిన టిక్‌టాక్ రీల్ ఓ మహిళ కొంపముంచింది. ఓ రెసిపీ కోసం రీల్ చేసే క్రమంలో ఆమె ముఖం కాలిపోయింది. అందమైన ఆవిడ ముఖం బొబ్బలతో నిండిపోయింది. 'జీవితంలో ఎదుర్కొన్న విపరీతమైన నొప్పి' అనే క్యాప్షన్‌తో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆవిడ పేరు షాఫియా బషీర్(37). టిక్‌టాక్‌లో జనాలను అట్రాక్ట్ చేసేందుకు ప్రత్యేకమైన వంటకం వీడియో తీయాలనుకుంది. ఈ క్రమంలో గుడ్లను మైక్రోవేవ్‌లో ఉడకబెట్టింది. ఆ తర్వాత బాగా ఉడికిన గుడ్లను బయటకు తీయాలనుకుంది. అందుకు చల్లని చెంచాను మైక్రోవేవ్‌లో పెట్టింది. అంతే.. అందులో ఉన్న వేడి నీరు ఒక్కసారిగా ఆమె ముఖం మీద పడ్డాయి. వెంటనే చల్లని నీటిలో ముఖం పెట్టినప్పటికీ.. తీవ్ర గాయాలయ్యాయి. ముఖమంతా బొబ్బలు వచ్చాయి. ఇంకేముంది ఆ తర్వాత ఆస్పత్రిలో జాయిన్ అయ్యింది. ఒంటరి మహిళ అయినందున చాలా ఖాళీ సమయం దొరుకుతుందని.. ఆ క్రమంలో టిక్‌టాక్‌లో వంటల వీడియోలు చేస్తుంటానని చెప్పింది. అయితే ప్రస్తుతం గాయం నుంచి కొలుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ ఘటన తన జీవితంలో విపరీతమైన నొప్పిని కలిగించిందని తెలిపింది. టిక్‌టాక్ వీడియోలు చేసే క్రమంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. చదవండి:‘ఏడాది పాటు షిప్పు ప్రయాణం’.. డబ్బు కట్టి గొల్లుమంటున్న జనం -
మచ్చలను పోగొట్టే మెరుపు
మార్కెట్లో దొరికే ఫేస్ క్రీమ్స్ కేవలం ఆయా సమయాల్లో మాత్రమే మెరుపునిస్తాయి. ముఖాన్ని అందహీనంగా మార్చే.. మచ్చలు, మొటిమలు శాశ్వతంగా తొలగిపోవాలంటే సహజసిద్ధమైన సౌందర్యలేపనాలను వాడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావాల్సినవి : క్లీనప్ : ఆలివ్ నూనె – 2 టీ స్పూన్లు, తేనె – పావు టీ స్పూన్, నిమ్మరసం – 5 లేదా 6 చుక్కలు స్క్రబ్ : మొక్కజొన్న పిండి – 1 టేబుల్ స్పూన్, నీళ్లు – కొద్దిగా మాస్క్: తులసి ఆకుల గుజ్జు – 3 టీ స్పూన్లు, పసుపు – చిటికెడు, గడ్డపెరుగు – పావు టీ స్పూన్, శనగపిండి – పావు టీ స్పూన్ తయారీ : ముందుగా ఆలివ్ నూనె, తేనె, నిమ్మరసం ఒక చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మొక్కజొన్న పిండి, సరిపడా నీళ్లు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు తులసి ఆకుల గుజ్జు, పసుపు, గడ్డపెరుగు, శనగపిండి ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
కొంచెం పప్పు వేయాలని అడిగినందుకు దారుణం
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. మధ్యహ్నా భోజనంలో భాగంగా తనకు కొంచెం పప్పు వేయాలని అడిగినందుకు ఓ వంటమనిషి ఒకటో తరగతి చదువుతున్న బాలుడి ముఖంపై వేడిగా కాలుతున్న పప్పును విసిరికొట్టాడు. దీంతో ఆ బాలుడి ముఖం కాలింది. అలాగే చెంపలు, ఛాతీ భాగం, వెనుక భాగం కూడా తీవ్రంగా గాయాలు అయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం దిండోరిలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ప్రిన్స్ మెహ్రా అనే విద్యార్థి ఒకటో తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్న భోజనం స్కూల్లోనే చేసే క్రమంలో నేమావతి బాయి అనే వంట చేసే మహిళను తనకు కొంచెం అదనంగా పప్పు వేయాలని కోరాడు. దాంతో ఆమె నేరుగా పప్పు అతడిపై విసిరి కొట్టింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.