న్యూయార్క్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. న్యూయార్క్ టైమ్ స్కైర్ వద్ద గుర్తు తెలియని దుండుగుడు కాల్పులకు తెగపడ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు భయాందోళనకు గురై ప్రాణభయంతో పరుగులు తీశారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం 4.55 గంటల సమయంలో సెవెన్త్ ఎవెన్యూ వద్ద ఓ దుండగుడు గన్‌తో బహిరంగంగా కాల్పులు జరిపాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ కాల్పులో గాయపడినవారు.. బ్రూక్లిన్‌కు చెందిన 4ఏళ్ల బాలిక, ఐలాండ్‌కు చెందిన యువతి(23), న్యూజెర్సీకి చెందిన మహిళ(43)గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం గాయపడిన వారి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కాల్పుల ఘటనపై మేయర్ బిల్ డి బ్లాసియో మాట్లాడుతూ.. దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, గాయపడ్డ బాధితులు కోలుకుంటున్నారు. నిందితుల్ని తక్షణమే అరెస్ట్ చేయాలని న్యూయార్క్ పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశా. తుపాకీల అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటామని అన్నారు. టైమ్ స్కైర్‌లో ఎంతమంది దుండగులు కాల్పులకు తెగబడ్డరో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీస్ కమిషనర్ డెర్మోట్ ఎఫ్. షియా అన్నారు. కానీ ప్రాథమిక నిర‍్ధారణలో ఒక్కడే కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment