శ్రీ రామజన్మ భూమి ట్రస్ట్ మొదటి సమావేశంలో పాల్గొన్న అధ్యక్షుడు నృత్యగోపాల్‌తో ఇతర సభ్యులు
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటైన ట్రస్టుకి అధ్యక్షుడిగా మహంత్ నృత్యగోపాల్ దాస్ ఎన్నికయ్యారు. చంపాత్ రాయ్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మందిర నిర్మాణం కోసం కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీ రామ మందిర ట్రస్టు బుధవారం లాయర్ కె.పరాశరన్ నివాసంలో సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర ప్రిన్సిపల్ కార్యదర్శిగా పనిచేసిన నృపేంద్ర మిశ్రాను మందిర నిర్మాణ కమిటీ చీఫ్‌గా ఎన్నుకున్నారు. అనంతరం చంపాత్ రాయ్ మాట్లాడుతూ.. మందిర నిర్మాణానికి భక్తులు ఇచ్చే విరాళాల కోసం అయోధ్య ఎస్‌బీఐలో ఖాతా తెరుస్తామన్నారు. పుణెకి చెందిన స్వామి గోవింద్ దేవ్ గిరిని కోశాధికారిగా నియమించినట్టు వెల్లడించారు. ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా హోంశాఖ అదనపు కార్యదర్శి జ్ఞానేశ్ కుమార్, యూపీ ప్రభుత్వ ప్రతినిధిగా అవినాశ్ అవస్తి, అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ జస్టిస్ అనూజ్‌కుమార్ ఝా హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment