
యూపీ బీజేపీ ఎంపీ హరినారాయణ్ రాజ్‌భర్ (ఫైల్‌ఫోటో)
లక్నో : ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద శ్రీరాముడికి ఇల్లు కేటాయించాలని బీజేపీ ఎంపీ హరినారాయణ్ రాజ్‌భర్ అయోధ్య జిల్లా మేజస్ట్రేట్‌కు లేఖ రాశారు. రాముడు ప్రస్తుతం టెంట్‌లో ఉంటున్నారని యూపీ ఎంపీ ఈ లేఖలో పేర్కొన్నారు.కాగా అయోధ్యలో రామమందిరం ఎప్పుడు నిర్మించినా అది తమ హయాంలోనే జరుగుతుందని, మరొకరితో సాధ్యం కాదని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
హిందూ సంస్కృతే భారత సంస్కృతని అన్నారు. మరోవైపు అయోధ్యలో మందిర నిర్మాణానికి బీజేపీ ప్రాధాన్యత ఇస్తుందని బీజేపీ చీఫ్ అమిత్ షా స్పష్టం చేశారు. మందిర్ వ్యవహారం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురాదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment