‘అత్యాచారాలను శ్రీరాముడు కూడా ఆపలేడు’ | Lord Ram Cant Prevent Rape Incidents BJP MLA | Sakshi
Sakshi News home page

రాముడు కూడా అత్యాచారాలను ఆపలేడు : బీజేజీ ఎమ్మెల్యే

Published Sun, Jul 8 2018 8:46 AM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM

Lord Ram Cant Prevent Rape Incidents BJP MLA - Sakshi

సురేందర్‌ సింగ్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే సురేందర్‌ సింగ్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలపై జరిగే అత్యాచారాలను శ్రీ రాముడు కూడా ఆపలేడని, అది చాలా సహజం’ అని పేర్కొన్నారు. రోహానియా నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన సురేందర్‌ శనివారం ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘మహిళలపై జరిగే అత్యాచారాలను రాముడు కూడా నివారించలేడు. ప్రతి ఒక్కరు మహిళలను తమ కుటుంబ సభ్యులుగా, అక్కచెల్లెలుగా భావించాలి. అందరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే అఘాయిత్యాలను నివారించగలం’ అంటూ వ్యాఖ్యానించారు. సురేందర్‌ సింగ్‌ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పలుమార్లు వార్తల్లో నిలిచారు.

ప్రభుత్వ అధికారుల కంటే ప్రాస్టిట్యూట్లు (వేశ్యలు) నయమని గతంలో ఓ కార్యాక్రమంలో వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అధికారులు డబ్బులు తీసుకుంటున్నారు కానీ, పనిచేయడం లేదని, వేశ్యలు డబ్బులు తీసుకున్నా డ్యాన్స్‌లు చేసి మనకు సంతోషం కలిగిస్తారన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు మొబైల్‌ ఫోన్స్‌ ఇవ్వడం వల్లనే యువత అత్యాచారాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్‌ కేసులో నిందితుడిగా ఉన్న మరో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌కు సురేందర్‌ సింగ్‌ మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement