Surender Singh
-
యు ముంబా సిక్సర్
గ్రేటర్ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌లో యు ముంబా జట్టు ఆరో విజయం సొంతం చేసుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 31–22తో పుణేరీ పల్టన్‌పై గెలుపొందింది. యు మంబా తరఫున అభిషేక్ సింగ్ 7 రైడ్ పాయింట్లు, ట్యాక్లింగ్‌లో సురేందర్ సింగ్ (4 పాయింట్లు) ఆకట్టుకున్నారు. పుణేరీ తరఫున అక్షయ్ జాధవ్ 5 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 35–29తో యూపీ యోధాపై గెలిచింది. -
‘ఐదుగురు పిల్లల్ని కనండి’
లక్నో : ఉత్తర ప్రదేశ్‌కి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేందర్ సింగ్ మరోసారి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పిల్లలు దేవుడు ఇచ్చిన బహుమతి అని ప్రతి హిందూ ఐదుగురు పిల్లల్ని కనాలని వ్యాఖ్యానించారు. హిందూ జనాభాను పెంచి దేశంలో హిందుత్వాని కాపాడాలని అన్నారు. ఇద్దరు పిల్లలు తండ్రికి, మరో ఇద్దరు పిల్లలు తల్లికి, మిగిలిన ఒక్కరు ఈ దేశం కోసమని పేర్కొన్నారు. దేశంలో అత్యాచారాలను నివారించడం శ్రీరాముడి వల్ల కూడా కాదని ఇటీవల పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బాలియాలో బుధవారం ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘ పిల్లలు దేవుడిచ్చిన బహుమతి. ఒక్కో హిందూ జంట ఐదుగురు పిల్లల్ని కనాలి. భారత దేశం బలంగా ఉండాలంటే, హిందువులు బలంగా ఉండాలి. హిందువులు బలహీనంగా మారితే, దేశం కూడా బలహీనంగా మారుతుంది. హిందువులు జనాభాను నియంత్రిస్తే దేశంలో మైనార్టీగా మారే అవకాశం ఉంది. హిందూవులు మెజార్టీగా ఉండాలి. తీవ్రవాదులుగా కాదు’ అని అన్నారు. సురేంద్ర సింగ్ ఇతర పార్టీ నేతలనే కాక సొంత పార్టీ నేతలను కూడా పలు సందర్భల్లో విమర్శించిన విషయం తెలిసిందే. కైరానా, నూర్పూర్ ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ ఓడిపోవడంపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌పై తీవ్రంగా మండిపడ్డారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇస్లాంకు, హిందుత్వానికి మధ్య యుద్ధం జరగబోతుందని పలు వ్యాఖ్యలు చేశారు. -
‘అత్యాచారాలను శ్రీరాముడు కూడా ఆపలేడు’
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సురేందర్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలపై జరిగే అత్యాచారాలను శ్రీ రాముడు కూడా ఆపలేడని, అది చాలా సహజం’ అని పేర్కొన్నారు. రోహానియా నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన సురేందర్ శనివారం ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘మహిళలపై జరిగే అత్యాచారాలను రాముడు కూడా నివారించలేడు. ప్రతి ఒక్కరు మహిళలను తమ కుటుంబ సభ్యులుగా, అక్కచెల్లెలుగా భావించాలి. అందరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే అఘాయిత్యాలను నివారించగలం’ అంటూ వ్యాఖ్యానించారు. సురేందర్ సింగ్ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పలుమార్లు వార్తల్లో నిలిచారు. ప్రభుత్వ అధికారుల కంటే ప్రాస్టిట్యూట్లు (వేశ్యలు) నయమని గతంలో ఓ కార్యాక్రమంలో వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అధికారులు డబ్బులు తీసుకుంటున్నారు కానీ, పనిచేయడం లేదని, వేశ్యలు డబ్బులు తీసుకున్నా డ్యాన్స్‌లు చేసి మనకు సంతోషం కలిగిస్తారన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు మొబైల్ ఫోన్స్ ఇవ్వడం వల్లనే యువత అత్యాచారాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ కేసులో నిందితుడిగా ఉన్న మరో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌కు సురేందర్ సింగ్ మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. Main daawe ke saath keh sakta hoon ki Bhagwan Ram bhi aa jaenge to bhi ye ghatna pe niyantran kar pana sambhav nahi hai. Ye samaj ka svabhavik pradooshan hai, jisse koi bhi vanchit rehne wala nahi hai: Surendra Singh, BJP MLA on incidents of rape pic.twitter.com/dgjA7QoCtz — ANI UP (@ANINewsUP) July 7, 2018 -
కత్తి వాడటం రాదని వెక్కిరించింది.. అందుకే పొడిచా
కత్తి వాడటం కూడా రాదు.. అంటూ కరుణ తనను వెక్కిరించిందని, అందుకే తనకు కత్తి ఎంత బాగా వాడటం వచ్చో చూపించాలనే ఆమెను అన్నిసార్లు పొడిచానని ఢిల్లీ టీచర్ హంతకుడు సురేందర్ సింగ్ పోలీసులకు వెల్లడించాడు. గత నాలుగేళ్లుగా ఇద్దరి మధ్య మంచి సంబంధాలే ఉండేవని, ఏడాది నుంచే అవి చెడిపోయాయని పోలీసులు చెప్పారు. తర్వాత కొంత కాలానికి మళ్లీ సర్దుకుందని అనుకున్నా.. ఆమె ఫేస్బుక్ చూసి తాను ఒక్కసారిగా షాక్ తిన్నానని సురేందర్ అన్నాడు. ఆమె ఫేస్బుక్ అకౌంట్ పాస్వర్డ్ తనకు తెలుసని, దాన్ని తెరిచి చూస్తే అందులో మోహిత్ అనే యువకుడికి ఆమె అభ్యంతరకరంగా ఉన్న తన ఫొటోలు పంపినట్లు, అతడితో బాగా సన్నిహితంగా చాటింగ్ చేసినట్లు ఉందని తెలిపాడు. తాను ముందుగా కరుణ బ్యాగ్ మీద కత్తి ఆడించానని సురేందర్ చెప్పాడు. అయితే.. కత్తి ఎలా వాడాలో కూడా నీకు తెలియదంటూ ఆమె తనను వెక్కిరించిందని, దాంతో దాన్ని తాను చాలా బాగా వాడగలనని చూపించడానికే అలా పొడిచానని వివరించాడు. పైగా, ఆ తర్వాత పో్లీసులకు ఫోన్ చేసింది కూడా వేరే ఎవరో కాదు.. స్వయంగా సురేందరే ఫోన్ చేసి చెప్పాడు. నాలుగేళ్ల పాటు తనతో సన్నిహితంగా ఉన్న ఆమె.. వేరే యువకుడికి అలాంటి ఫొటోలు పంపడం చూసి తాను ఎంతో ఆవేదన చెందానని, దాని గురించి ఆమెను అడిగితే 'నా మీద గూఢచర్యం చేస్తున్నావా' అంటూ తిట్టిపోసిందని సురేందర్ తెలిపాడు. తాను, కరుణ కలిసి ఉన్నప్పటి కొన్ని ఫొటోలను కూడా అతడు పోలీసులకు చూపించాడు. ఇద్దరి ఫేస్బుక్ అకౌంట్లలో కూడా ఆ ఫొటోలున్నాయి. సోషల్ మీడియాలో ఆదిత్య అనే పేరుతో సురేందర్ సింగ్ అకౌంట్లున్నాయి. 2012 నుంచి తామిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందని.. అయితే ఇటీవల మోహిత్ తనకు ఆమె బాగా తెలుసని చెబుతూ ఆమె పంపిన ఫొటోలు తనకు చూపించాడని, అవి చూసి తన కళ్లను తానే నమ్మలేకపోయానని వివరించాడు. తర్వాత ఆమెకు ఫోన్ చేసి తాము ఎప్పుడూ కలుసుకునే జీటీబీ మెట్రోస్టేషన్ వద్దకు పిలిచానని చెప్పాడు. వాళ్లిద్దరి మొబైల్ ఫోన్ లొకేషన్లు చూడగా.. ఇద్దరూ హత్యకు ముందు గంట నుంచి అక్కడే ఉన్నట్లు తేలింది. -
ఎన్డీఎంసీ సభ్యునిగా నామినేట్ అయిన కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నన ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, ఢిల్లీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సురేందర్ సింగ్‌ని న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్డీఎంసీ) సభ్యులుగా నామినేట్ చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వారిద్దరూ ఈ నెల 20న ఎన్డీఎంసీ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొత్త సభ్యుల చేరిక తర్వాత ఎన్డీఎంసీ 2015-16కి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను మార్చి 25న ప్రవేశపెడతారు. ఇదిలా ఉండగా కరావల్ నగర్ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా ఢిల్లీ జల్ బోర్డు ఉపాధ్యక్షునిగా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు.