న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నన ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, ఢిల్లీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సురేందర్ సింగ్
సాక్షి, న్యూఢిల్లీ: న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నన ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, ఢిల్లీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సురేందర్ సింగ్‌ని న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్డీఎంసీ) సభ్యులుగా నామినేట్ చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వారిద్దరూ ఈ నెల 20న ఎన్డీఎంసీ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొత్త సభ్యుల చేరిక తర్వాత ఎన్‌డీఎంసీ 2015-16కి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను మార్చి 25న ప్రవేశపెడతారు. ఇదిలా ఉండగా కరావల్ నగర్ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా ఢిల్లీ జల్ బోర్డు ఉపాధ్యక్షునిగా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు.