న్యూఢిల్లీ: బిర్లా మందిరం ప్రాంగణంలోని దుకాణాల్లో పనిచేసే గుమస్తాలపై బలవంతంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఢిల్లీ హైకోర్టు... న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను శనివారం ఆదేశించింది. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారం రోజులపాటు నిషేధం విధిస్తున్నట్లు జస్టిస్ మన్‌మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. హక్కులను కాలరాసేందుకు యత్నిస్తున్న ఎన్‌ఎండీసీపై అపిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలని గుమస్తాలకు సూచించింది. పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఎన్‌ఎండీసీకి సూచిం చింది. నలుగురు గుమస్తాల విజ్ఞప్తిని న్యాయవాది అనుసూర్య సాల్వన్ కోర్టుకు వివరించారు. ఎన్‌ఎండీసీ చట్టంలోని పలు సెక్షన్ల కింద గుమస్తాలకు షోకాజ్ నోటీసును జారీ చేసిందని, బిర్లా మందిరం పరిసరాలను దుర్వినియోగం చేశారని పేర్కొనట్లు వాదించారు.
అదేవిధంగా అక్రమంగా వ్యాపారాలను నిర్వహిస్తున్నారని హెచ్చరికలు జారీ చేసిందని వివరించారు. 1939లో భూమి భవనాల శాఖ శ్రీ సంతాన్ ధర్మ సభ లక్ష్మి నారాయణ దేవాలయం ట్రస్టీకి అప్పగించింది. ట్రస్టీ ఆధ్వర ్యంలో నిర్మిస్తున్న బిర్లామందిరంలో భక్తుల సౌకర్యార్థం దుకాణాలను ఏర్పాటు చేసిందని వివరించారు. ఇందులో భక్తి పుస్తకాలు, సామగ్రి, సీడీలు విగ్రహాలు, పూలు తదితర పూజా వస్తువులు, ప్రసాదాలు విక్రయించడానికి అనుమతి ఉన్నదన్నారు. అయితే అనధికార నిర్మాణాలకు మాత్రమే ఎన్‌ఎండీసీ చట్టంలోని సెక్షన్ 250 వర్తిస్తుందని చెప్పారు. గుమస్తాలు దుకాణాలను కొనసాగకుండా ఎలాంటి చర్యలు తీసుకోరాదని కోరారు. ఈ మేరకు కోర్టు పై ఆదేశాలు జారీ చేసింది.
గుమస్తాలకు వ్యతిరేకంగా ఎలాంటి చర్య తీసుకోవద్దు: హైకోర్టు
Published Sat, Sep 13 2014 10:50 PM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM
Advertisement