New Delhi Municipal Corporation
-
ఢిల్లీ: బీఆర్ఎస్ ఫ్లెక్సీల తొలగింపు
ఢిల్లీ: భారత రాష్ట్ర సమితికి ఆదిలోనే షాక్ తగిలింది. బీఆర్ఎస్ కార్యాలయం ముందు ఫ్లెక్సీలను తొలగించింది న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్. ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్డులో ఉన్న పార్టీ కార్యాలయం ఎదుట అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని చెప్తూ.. అధికారులు మంగళవారం వాటిని తొలగించారు. ఎన్డీఎంసీ ఫ్లెక్సీల తొలగింపు వ్యవహారంపై గులాబీ పార్టీ శ్రేణులు స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం కోసం హస్తినకు చేరుకున్న ఆ పార్టీ అధినేత కేసీఆర్ యాగాల్లో పాల్గొననున్నారు. ఈ నెల 14న బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభం కానుంది. తెలంగాణ నుంచి జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడం లక్ష్యంగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ని ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఢిల్లీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ‘శక్తి’ క్యాబ్‌లు
న్యూఢిల్లీ: నగర మహిళకు భద్రత కల్పించాలని న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్డీఎంసీ) భావిస్తోంది. వారిపై మహిళలపై బస్సులు, ట్యాక్సీల్లో దాడులు పెరుగుతుండడంతో మహిళా ట్యాక్సీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘శక్తి’ పేరుతో 20 ట్యాక్సీలను ప్రారంభించాలని స్థానిక సంస్థ ఏర్పాట్లు చేసుకుంది. కానీ ఎన్డీఎంసీ కొన్ని కారణాలతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంది. దీనిపై ఎన్ఎండీసీ చైర్పర్సన్ జలాజ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ తాము ఇంకా రవాణా శాఖను సంప్రదించాల్సి ఉందని, ఇలాంటి సేవలను ప్రారంభించాలంటే మొదట 100 ట్యాక్సీల ఏర్పాటు చేయాల్సి ఉందని తెలిపారు. కానీ నిధులలేమి కారణంగా పైలట్ ప్రాజెక్ట్‌గా కేవలం 20 ట్యాక్సీలతో ప్రారంభించాలని నిర్ణయించినట్టు ఆమె వెల్లడించారు. ఈ సేవలను వ చ్చే నెల నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కాగా, ఈ ట్యాక్సీలకు మహిళలే డ్రైవ ర్లుగా ఉంటారని పేర్కొన్నారు. చిన్న పిల్లలు సులువుగా నేరగాళ్ల బారిన పడుతుండడంతో కార్పొరేషన్ పరిధిలో నడిచే అన్ని పాఠశాలల బస్సుల్లోనూ మహిళా డ్రైవర్లనే నియమించేందుకు యత్నిస్తున్నట్టు తెలిపారు. -
ఎన్డీఎంసీ సభ్యునిగా నామినేట్ అయిన కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నన ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, ఢిల్లీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సురేందర్ సింగ్‌ని న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్డీఎంసీ) సభ్యులుగా నామినేట్ చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వారిద్దరూ ఈ నెల 20న ఎన్డీఎంసీ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొత్త సభ్యుల చేరిక తర్వాత ఎన్డీఎంసీ 2015-16కి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను మార్చి 25న ప్రవేశపెడతారు. ఇదిలా ఉండగా కరావల్ నగర్ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా ఢిల్లీ జల్ బోర్డు ఉపాధ్యక్షునిగా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. -
గుమస్తాలకు వ్యతిరేకంగా ఎలాంటి చర్య తీసుకోవద్దు: హైకోర్టు
న్యూఢిల్లీ: బిర్లా మందిరం ప్రాంగణంలోని దుకాణాల్లో పనిచేసే గుమస్తాలపై బలవంతంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఢిల్లీ హైకోర్టు... న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను శనివారం ఆదేశించింది. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారం రోజులపాటు నిషేధం విధిస్తున్నట్లు జస్టిస్ మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. హక్కులను కాలరాసేందుకు యత్నిస్తున్న ఎన్ఎండీసీపై అపిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలని గుమస్తాలకు సూచించింది. పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఎన్ఎండీసీకి సూచిం చింది. నలుగురు గుమస్తాల విజ్ఞప్తిని న్యాయవాది అనుసూర్య సాల్వన్ కోర్టుకు వివరించారు. ఎన్ఎండీసీ చట్టంలోని పలు సెక్షన్ల కింద గుమస్తాలకు షోకాజ్ నోటీసును జారీ చేసిందని, బిర్లా మందిరం పరిసరాలను దుర్వినియోగం చేశారని పేర్కొనట్లు వాదించారు. అదేవిధంగా అక్రమంగా వ్యాపారాలను నిర్వహిస్తున్నారని హెచ్చరికలు జారీ చేసిందని వివరించారు. 1939లో భూమి భవనాల శాఖ శ్రీ సంతాన్ ధర్మ సభ లక్ష్మి నారాయణ దేవాలయం ట్రస్టీకి అప్పగించింది. ట్రస్టీ ఆధ్వర ్యంలో నిర్మిస్తున్న బిర్లామందిరంలో భక్తుల సౌకర్యార్థం దుకాణాలను ఏర్పాటు చేసిందని వివరించారు. ఇందులో భక్తి పుస్తకాలు, సామగ్రి, సీడీలు విగ్రహాలు, పూలు తదితర పూజా వస్తువులు, ప్రసాదాలు విక్రయించడానికి అనుమతి ఉన్నదన్నారు. అయితే అనధికార నిర్మాణాలకు మాత్రమే ఎన్ఎండీసీ చట్టంలోని సెక్షన్ 250 వర్తిస్తుందని చెప్పారు. గుమస్తాలు దుకాణాలను కొనసాగకుండా ఎలాంటి చర్యలు తీసుకోరాదని కోరారు. ఈ మేరకు కోర్టు పై ఆదేశాలు జారీ చేసింది. -
ప్రపంచస్థాయి నగరంగా ఢిల్లీ
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు - బ్లూప్రింట్ రూపకల్పనకు చొరవ - వివిధ శాఖల అధికారులతో చర్చ న్యూఢిల్లీ: దేశ జాతీయ రాజధానిని కేంద్రం ప్రభుత్వం ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దనుంది. ఈ దిశగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు చొరవ తీసుకున్నారు. ఇందులోభాగంగా నగర సుందరీకరణ, అభివృద్ధికి ఓ బ్లూప్రింట్ రూపొందించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. కేంద్ర ప్రజాపనుల శాఖతోపాటు తన శాఖకు చెందిన ఉన్నతాధికారులతో శుక్రవారం సమావేశమైన మంత్రి ఈ అంశంపై విస్తృతంగా చర్చించారు. దీంతోపాటు మురుగునీటి పారుదలను మెరుగుపరచడం, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చేయడం వంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. రహదారులు, పాత్‌వేలు. ఖాళీ స్థలాలు, ప్రజాదరణ పొందిన స్మారకాల నిర్వహణ తదితర అంశాలను కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల విషయంలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నగరవాసుల ఆకాంక్షలకు అనుగుణంగా దీనిని తీర్చిదిద్దాలన్నారు. భారతీయుడుగానీ లేదా విదేశాలనుంచి తొలిసారిగా ఇక్కడికి వచ్చే ప్రతిని ధుల బృందం ఈ నగరాన్ని చూసినపుడు ఎలాంటి అనుభూతి పొందుతాడనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తదనుగుణంగా నగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలను రూపొందించాలని ఆయన ఈ సందర్భంగా అధికారులకు సూచించా రు. ఇతర దేశాల్లోని నగరాలతో పోలిస్తే ఢిల్లీకి ఎన్నో స్థానంలో ఉండొచ్చనే అంశంపైనా చర్చించారు. ఇంకా ఈ సమావేశంలో ఉత్తర ఢిల్లీ, దక్షిణ, న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లకు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.