న్యూఢిల్లీ: డ్రైవర్లకు లెసైన్సులు మంజూరు చేసే ముందు ఎలాంటి పరీక్షలను నిర్వహిస్తున్నారన్న విషయాన్ని తమకు వివరించాలని ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. డ్రైవర్ల లెసైన్సులకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బీడీ.అహ్మద్, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవ్‌లు విచారించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు డ్రైవింగ్ లెసైన్సుల మంజూరుకి మొత్తం 91 పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ కోర్టుకు నివేదించింది.
మే 13న జరగనున్న తదుపరి విచారణలోగా పూర్తి సమాచారాన్ని తెలియజేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఢిల్లీలో డ్రైవర్లు సరైన లెసైన్సులు లేకుండా వాహనాలు నడుపుతున్నారని స్వచ్ఛంద సంస్థలైన ఆజాద్ దాస్త సంకల్ప హమారా, నవ్ జాగృతి మంచ్‌లు కోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశాయి. 2008లో లెసైన్సులు పొందిన 4,415 మందిలో 850 మంది డ్రైవింగ్‌కు అనర్హులని డీటీసీ మెడికల్ బోర్డు తేల్చింది. కానీ ఈ 850 మందిలో 56 మందిని మరో మెడికల్ బోర్డు అర్హులుగా తేల్చి లెసైన్సులు మంజూరు చేసిందని ఆరోపిస్తూ ఈ రెండు స్వచ్ఛంద సంస్థలు పిటిషన్‌లు దాఖలు చేశాయి.
డ్రైవింగ్ లెసైన్సుల మంజూరుకు ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు?
Published Mon, Mar 30 2015 3:46 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM
Advertisement