‘ఐదుగురు పిల్లల్ని కనండి’ | Surender Singh Says Every Hindu Have Five Children | Sakshi
Sakshi News home page

హిందువులు ఐదుగురు పిల్లల్ని కనండి : బీజేపీ ఎమ్మెల్యే

Published Thu, Jul 26 2018 4:20 PM | Last Updated on Thu, Jul 26 2018 4:53 PM

Surender Singh Says Every Hindu Have Five Children - Sakshi

సురేందర్‌ సింగ్‌ (ఫైల్‌ ఫోటో)

లక్నో : ఉత్తర ప్రదేశ్‌కి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేందర్‌ సింగ్‌ మరోసారి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పిల్లలు దేవుడు ఇచ్చిన బహుమతి అని ప్రతి హిందూ ఐదుగురు పిల్లల్ని కనాలని వ్యాఖ్యానించారు. హిందూ జనాభాను పెంచి దేశంలో హిందుత్వాని కాపాడాలని అన్నారు. ఇద్దరు పిల్లలు తండ్రికి, మరో ఇద్దరు పిల్లలు తల్లికి, మిగిలిన ఒక్కరు ఈ దేశం కోసమని పేర్కొన్నారు. దేశంలో అత్యాచారాలను నివారించడం శ్రీరాముడి వల్ల కూడా కాదని ఇటీవల పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బాలియాలో బుధవారం ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘ పిల్లలు దేవుడిచ్చిన బహుమతి. ఒక్కో హిందూ జంట ఐదుగురు పిల్లల్ని కనాలి.


భారత దేశం బలంగా ఉండాలంటే, హిందువులు బలంగా ఉండాలి. హిందువులు బలహీనంగా మారితే, దేశం కూడా బలహీనంగా మారుతుంది. హిందువులు జనాభాను నియంత్రిస్తే దేశంలో మైనార్టీగా మారే అవకాశం ఉంది. హిందూవులు మెజార్టీగా ఉండాలి. తీవ్రవాదులుగా కాదు’ అని అన్నారు. సురేంద్ర సింగ్‌ ఇతర పార్టీ నేతలనే కాక సొంత పార్టీ నేతలను కూడా పలు సందర్భల్లో విమర్శించిన విషయం తెలిసిందే. కైరానా, నూర్‌పూర్‌ ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ ఓడిపోవడంపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌పై తీవ్రంగా మండిపడ్డారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇస్లాంకు, హిందుత్వానికి మధ్య యుద్ధం జరగబోతుందని  పలు  వ్యాఖ్యలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement