లక్నో : ఎస్పీ, బీస్పీలు అక్రమ వలసదారులను ఓటు బ్యాంక్‌లా పరిగణిస్తాయని, తమ పార్టీ చొరబాట్లను జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా చూస్తుందని బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. యూపీలోని మహరాజ్‌గంజ్‌లో శుక్రవారం ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎస్పీ-బీఎస్పీ కూటమిపై నిప్పులు చెరిగారు.
అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి తమ పార్టీ కట్టుబడిఉందన్నారు. విపక్షాలు రామమందిర అంశంపై తమ వైఖరిని వెల్లడించాలని అమిత్ షా సవాల్ విసిరారు.రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో యూపీలో గతంలో సాధించిన స్ధానాలను నిలబెట్టుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. కాగా తూర్పు యూపీలో వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీని ప్రధాన కార్యదర్శిగా బరిలో నిలపడంతో యూపీ ఎన్నికల రాజకీయం వేడెక్కిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment