intruders
-
‘అక్రమ వలసదారులే వారి ఓట్ బ్యాంక్’
లక్నో : ఎస్పీ, బీస్పీలు అక్రమ వలసదారులను ఓటు బ్యాంక్‌లా పరిగణిస్తాయని, తమ పార్టీ చొరబాట్లను జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా చూస్తుందని బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. యూపీలోని మహరాజ్‌గంజ్‌లో శుక్రవారం ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎస్పీ-బీఎస్పీ కూటమిపై నిప్పులు చెరిగారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి తమ పార్టీ కట్టుబడిఉందన్నారు. విపక్షాలు రామమందిర అంశంపై తమ వైఖరిని వెల్లడించాలని అమిత్ షా సవాల్ విసిరారు.రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో యూపీలో గతంలో సాధించిన స్ధానాలను నిలబెట్టుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. కాగా తూర్పు యూపీలో వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీని ప్రధాన కార్యదర్శిగా బరిలో నిలపడంతో యూపీ ఎన్నికల రాజకీయం వేడెక్కిన సంగతి తెలిసిందే. -
అక్బర్‌పై సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొఘల్ చక్రవర్తులు అక్బర్, ఔరంగజేబు, బాబర్‌లపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబర్, అక్బర్, ఔరంగజేబు భారతదేశాన్ని నాశనం చేసి ఆక్రమించుకోవడానికి వచ్చినవారని యోగి వ్యాఖ్యానించారు. మహారాణా ప్రతాప్ చూపిన మార్గాన్ని యువత అనుసరించాలని సూచించారు. ఈ నిజాన్నియువత అంగీకరిస్తే భారతదేశానికి ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయని తెలిపారు. మహారాణా ప్రతాప్ 477వ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే మహారాణా ప్రతాప్, గురు గోవింద్ సింగ్, ఛత్రపతి శివాజీ మనందరికీ ఆదర్శప్రాయులన్నారు. యువకులు మహారాణా ప్రతాప్ నుంచి ఆత్మగౌరవంతో ఎలా జీవించాలి, జీవితంలో ఎలా బతకాలో నేర్చుకోవాలన్నారు. గొప్ప చరిత్ర ఉన్న భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడాలని యువకులను కోరారు. గొప్ప చరిత్రను కాపాడుకోలేని వారు.. భారతదేశాన్ని ఆక్రమణదారుల నుంచి కాపాడలేరని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ రాం నాయక్, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రిటైర్డ్ జనరల్ వీకే సింగ్ కూడా పాల్గొన్నారు. -
దొంగలకు చుక్కలు చూపించిన స్ప్రే
క్వజులు-నటల్(ద.ఆ): ఓ స్టోర్‌లో ఎవరూ లేని సమయంలో చోరీ చేద్దామని వచ్చిన దుండగులు ఒక్కసారిగా పరుగులు పెడుతూ పారిపోయారు. ఈ సంఘటన దక్షిణ అమెరికాలోని క్వజులు-నటల్లోని బోతాస్ హిల్స్‌లో ఉన్న షుగర్ లోఫ్ సెంటర్లో చోటు చేసుకుంది. వివరాలు.. గత నెలలో వరుసగా జరిగిన చోరీలలో షుగర్ లోఫ్ సెంటర్లో ఓ టీవీ, మూడు కంప్యూటర్లను దుండగులు ఎత్తుకు పోయారు. దీంతో స్టోర్ యజమాని మోర్నే బోత్మా ఓ సెక్యురిటీ ఏజెన్సీని ఆశ్రయించింది. వారు చిల్లీ పెప్పర్ గ్యాస్ అలారమ్‌ను స్టోర్‌లో బిగించారు. అయితే చిల్లీ పెప్పర్ గ్యాస్ అలారమ్ గురించి తెలియకుండా స్టోర్‌లో చోరీ చేయడానికి ముగ్గురు దుండగులు ప్రవేశించారు. ముందుగా డోర్ చైన్‌ను కట్ చేయడానికి ప్రయత్నించి విఫలం అవ్వడంతో చివరకు గ్లాస్ డోర్‌ను పగలగొట్టి స్టోర్‌లోకి వచ్చారు. దుండగుల్లో ఒకరు టీవీని చోరీ చేయడానికి ప్రయత్నించగా, చిల్లీ పెప్పర్ గ్యాస్ అలారమ్ ఆక్టివ్ అయ్యింది. అంతే చిల్లీ పెప్పర్ స్ప్రే అవ్వడంతో పాటూ అలారమ్ కూడా రావడంతో దుండగులు షాక్‌కు గురయ్యారు. ఏం జరుగుతుందో అని వెంటనే అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే బయటకు వెళ్లిన వారిలో ఒకరు మళ్లీ స్టోర్‌లోకి రావడానికి ప్రయత్నించాడు. కానీ స్టోర్ నిండా పెప్పర్ స్ప్రే అవ్వడంతో చేసేదేమీలేక ఒట్టిచేతులతోనే ఇంటి ముఖం పట్టాడు. స్టోర్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయిన వీడియోను పోలీసులు విడుదల చేశారు. 'ఇంతకు ముందు సీసీకెమెరాలు బిగించినా దుండగులు మాస్క్‌లు ధరించి చోరీలు చేశారు. నిజంగా చిల్లీ పెప్పర్ గ్యాస్ అలారమ్ అద్భుత ఫలితాన్నిచ్చింది' అని స్టోర్ యజమాని మోర్నే బోత్మా తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుండగుల కోసం గాలింపుముమ్మరం చేసినట్టు పోలీసులు తెలిపారు.