బెంగుళూరు : ఒక మతానికి వ్యతిరేకంగా పెట్టిన ఓ ఫేస్‌బుక్ పోస్టు వల్ల కర్ణాటకలో వారం రోజుల క్రితం జరిగిన హింసాకాండ మరువకముందే మళ్లీ అలాంటి ఘటనే చోటుచేసుకుంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. ఓ వాట్సాప్ గ్రూపులో శ్రీరామునిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన 20 ఏళ్ల ముస్లిం వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. కర్ణాటకలో రాయచూర్‌లోని దేవదుర్గ ప్రాంతానికి చెందిన వ్యక్తి రాముడిని తీవ్రపదజాలంతో దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. అది కాస్తా వైరల్ కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. (డబ్బున్న యువతులే టార్గెట్)
ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకముందే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని దేవదుర్గ పోలీసులు తెలిపారు. గతవారం ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఓ పోస్టు బెంగళూరులో కల్లోలానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఇది కాస్తా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇంటిపై దాడికి ప్రేరేపించింది. ఈ క్రమంలో తీవ్ర స్థాయిలో అల్లర్లు చెలరేగగా రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితులను అదుపులోకి తెచ్చే క్రమంలో కాల్పులు జరిపారు. ఈ హింసాకాండలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా సాధారణ పౌరులతో పాటు 60 మంది పోలీసులకు కూడా గాయాల పాలయ్యారు. (ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. చెలరేగిన హింస)
Comments
Please login to add a commentAdd a comment