
Sri Rama Navami 2024: శ్రీరామ నవమి సందర్భంగా భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆమెను ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు.
అనంతరం ఆలయం వెలుపల పీవీ సింధు మీడియాతో మాట్లాడారు. ‘‘ శ్రీ రామ నవమి నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మలేసియా, ఇండోనేషియాలో టోర్నమెంట్స్, ఒలింపిక్స్ జరుగనున్నాయి. ఈ టోర్నమెంట్లలో బాగా రాణించాలని కోరుకున్నా’’ అని పీవీ సింధు తెలిపారు.