
సాక్షి, తిరుమల : త్వరలో విశాఖపట్నంలో అకాడమీ ప్రారంభిస్తానని, యువతను ప్రోత్సహించేందుకే తాను అకాడమీ ప్రారంభిస్తున్నానని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు చెప్పారు. చాలా మంది యువత సరైన ప్రోత్సాహం లేక వెనుకబడుతున్నారని అన్నారు. శుక్రవారం పీవీ సింధు కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వారితో పాటు చాముండేశ్వరీనాథ్ కూడా ఉన్నారు.
అనంతరం సింధు మాట్లాడుతూ.. ‘‘ శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఏడాది స్వామి ఆశీస్సుల కోసం తిరుమలకు వస్తాను. ఈ సారి ఒలింపిక్స్ అయ్యాక తిరుమలకు వచ్చాను. స్వామి వారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరాను. రాబోవు టోర్నమెంట్స్‌లో కూడా స్వామి వారి ఆశీస్సులు ఉండాలి. మంచి మెడల్‌తో అందిరి ముందుకు వస్తాను. ప్రజలందరూ కోవిడ్ మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలి’’ అని అన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
శుక్రవారం మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డిలు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి
బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి
యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment