
హైదరాబాద్ : టీఎస్‌సెట్–2017లో అర్హత సాధించిన అభ్యర్థులకు శుక్రవారం నుంచి (9వ తేదీ) నుంచి సర్టిఫికెట్లు జారీ చేయనున్నట్లు సెట్ సభ్యకార్యదర్శి ప్రొఫెసర్ యాదగిరిస్వామి గురువారం తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య కేంద్రంలోని సెట్ కార్యాలయంలో ఉదయం 11 నుంచి సర్టిఫికెట్లు పొందవచ్చని వెల్లడించారు.