ఇంకా వర్తించని మూడో విడత రుణమాఫీ
వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు
పాలకుర్తి టౌన్ : రుణమాఫీ పొందిన రైతులకు రెండేళ్లుగా సీజన్ ప్రారంభంలో తిరిగి పంటరుణా లు పొందేందుకు అవస్థలు తప్పడం లేదు. రెండేళ్లుగా వరుస కరువు పరి స్థితులను ఎదుర్కొంటున్న రైతులు గత పది రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలకు పంటల సాగుపై ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే డివిజన్‌లో పత్తి, మొక్కజొన్న సాగుకు రైతులు విత్తనాలు విత్తుకోగా వరిసాగుకు నార్లు పోసుకున్నారు. సీజన్ ప్రారంభమై నెలరోజులు పూర్తయినా బ్యాంకుల నుంచి పంట రుణాలు రీ షెడ్యూల్ చేయడంలో జాప్యం జరుగుతోంది. ఇటీవల ప్రభుత్వం మూడో విడత రైతు రుణమాఫీ నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసినా అవి బ్యాంకుల్లో జమ కాలేదని బ్యాంకు అధికారులు విముఖత చూపుతున్నారు.
దీంతో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. రెండేళ్లుగా కరువుతో పంటలు చేతికందక ఆర్ధికంగా చితికిపోయిన రైతులు ఇప్పుడు ఖరీఫ్ సాగుకోసం మళ్లీ అప్పు లు చేయక తప్పటంలేదు. దీం తో చిన్న, సన్నకారు రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తు న్నారు. ఈ సీజన్‌లో 50 శాతం పత్తి సాగును తగ్గించి ప్రత్యామ్నాయంగా ఆరుతడి, ఇతర పంటలు సాగు చేయించాలని వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందించింది. అయినా రైతులు పత్తిపైనే మొగ్గు చూపుతున్నా రు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ రైతులకు సరైన ప్రోత్సాహం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంట రుణాలను రీ షెడ్యూల్ చేసి రుణాలు ఇవ్వాలని అన్నదాతలు కోరుతున్నారు.
రుణాల కోసం ఎదురుచూపు
Published Wed, Jul 13 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 4:42 AM
Advertisement
Advertisement