Debt waived
-
రుణాల కోసం ఎదురుచూపు
ఇంకా వర్తించని మూడో విడత రుణమాఫీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు పాలకుర్తి టౌన్ : రుణమాఫీ పొందిన రైతులకు రెండేళ్లుగా సీజన్ ప్రారంభంలో తిరిగి పంటరుణా లు పొందేందుకు అవస్థలు తప్పడం లేదు. రెండేళ్లుగా వరుస కరువు పరి స్థితులను ఎదుర్కొంటున్న రైతులు గత పది రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలకు పంటల సాగుపై ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే డివిజన్లో పత్తి, మొక్కజొన్న సాగుకు రైతులు విత్తనాలు విత్తుకోగా వరిసాగుకు నార్లు పోసుకున్నారు. సీజన్ ప్రారంభమై నెలరోజులు పూర్తయినా బ్యాంకుల నుంచి పంట రుణాలు రీ షెడ్యూల్ చేయడంలో జాప్యం జరుగుతోంది. ఇటీవల ప్రభుత్వం మూడో విడత రైతు రుణమాఫీ నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసినా అవి బ్యాంకుల్లో జమ కాలేదని బ్యాంకు అధికారులు విముఖత చూపుతున్నారు. దీంతో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. రెండేళ్లుగా కరువుతో పంటలు చేతికందక ఆర్ధికంగా చితికిపోయిన రైతులు ఇప్పుడు ఖరీఫ్ సాగుకోసం మళ్లీ అప్పు లు చేయక తప్పటంలేదు. దీం తో చిన్న, సన్నకారు రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తు న్నారు. ఈ సీజన్లో 50 శాతం పత్తి సాగును తగ్గించి ప్రత్యామ్నాయంగా ఆరుతడి, ఇతర పంటలు సాగు చేయించాలని వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందించింది. అయినా రైతులు పత్తిపైనే మొగ్గు చూపుతున్నా రు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ రైతులకు సరైన ప్రోత్సాహం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంట రుణాలను రీ షెడ్యూల్ చేసి రుణాలు ఇవ్వాలని అన్నదాతలు కోరుతున్నారు. -
రైతు సమస్యలు వదిలి విదేశీ పర్యటనలా?
హన్మకొండ సిటీ : రాష్ట్రవ్యాప్తంగా రైతులు వర్షాలు లేక, కరెంటు సరఫరా సక్రమంగా జరగక ఇబ్బందులు పడుతుం టే ముఖ్యమంత్రి కేసీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లడం సరికాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నారు. హన్మకొండ ఎన్జీవోస్‌కాలనీలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశలో అశోక్‌రెడ్డి మాట్లాడారు. వర్షాభావం, విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారని, పెట్టుబడి కోల్పో యి ఆదాయం వచ్చే మార్గం లేక అల్లాడుతున్న రైతన్నలను భరోసా కల్పించాల్సింది పోయి విదేశాలకు వెళ్లడం ఎంత వర కు సమంజసమని ప్రశ్నించారు. ఇక పంట రుణాల మాఫీపై ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వకపోవడం గర్హనీయమని ఆరోపించారు. కాగా, నైజాం పాలన నుంచి విముక్తి పొందిన రోజు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారి కంగా జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశం లో నాయకులు శ్రీరాముల మురళీమనోహర్, రాజిరెడ్డి, కుమారస్వామి, దిలీప్‌నాయక్, దుప్పటి భద్రయ్య, త్రిలోకేశ్వర్‌రావు, భాస్కర్, రవళి పాల్గొన్నారు. -
మాఫీపై బాబుకు నిరసనల సెగ
తొలిరోజు పర్యటనలో భాగంగా చంద్రబాబు గాజువాక, అనకాపల్లి, చోడవరంలో పర్యటించగా పలుచోట్ల రైతులు, డ్వాక్రా మహిళలు రుణమాఫీపై చంద్రబాబు ముందు తమ నిరసనలు వ్యక్తం చేశారు. బ్యాంకులు తిరిగి రుణాలు చెల్లించమంటూ ఒత్తిడి చేస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సీఎం చంద్రబాబు మాత్రం రుణమాఫీపై ప్రశ్నించినవారిపై తీవ్రంగా ఊగిపోయారు. అనకాపల్లికి సమీపంలోని తుమ్మపాల చెరకు ఫ్యాక్టరీ రైతులతో జరిగిన ముఖాముఖీలో మాఫీపై ప్రశ్నించిన ఓ రైతును యూజ్‌లెస్‌ఫెలో అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. గంధవరం గ్రామంలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఓ మహిళ డ్వాక్రా మహిళలపై నిరసన వ్యక్తం చేయగా... చేసేవాళ్లు ఉంటే అడిగేవారు ఎక్కువ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఈడీ పట్టభద్రులు, ప్రస్తుతం కోర్సు చదువుతున్న నిరుద్యోగులకు ఎస్జీటీలుగా అవకాశం కల్పించాలని, ప్రస్తుతం డీఎడ్ అభ్యర్థులకు ఈ ఏడాది సెప్టెంబరులో జరగనున్న డీఎస్సీలో అవకాశం కల్పించాలని చోడవరంలో విద్యార్థులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. 14 నెలలుగా జీతాల్లేక అవస్థలు పడుతున్నామని వెలుగు సీఏలు గజపతినగరం గ్రామంలో విన్నవించారు. అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు.