రైతు సమస్యలు వదిలి విదేశీ పర్యటనలా?
హన్మకొండ సిటీ : రాష్ట్రవ్యాప్తంగా రైతులు వర్షాలు లేక, కరెంటు సరఫరా సక్రమంగా జరగక ఇబ్బందులు పడుతుం టే ముఖ్యమంత్రి కేసీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లడం సరికాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నారు. హన్మకొండ ఎన్జీవోస్‌కాలనీలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశలో అశోక్‌రెడ్డి మాట్లాడారు. వర్షాభావం, విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారని, పెట్టుబడి కోల్పో యి ఆదాయం వచ్చే మార్గం లేక అల్లాడుతున్న రైతన్నలను భరోసా కల్పించాల్సింది పోయి విదేశాలకు వెళ్లడం ఎంత వర కు సమంజసమని ప్రశ్నించారు.
ఇక పంట రుణాల మాఫీపై ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వకపోవడం గర్హనీయమని ఆరోపించారు. కాగా, నైజాం పాలన నుంచి విముక్తి పొందిన రోజు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారి కంగా జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశం లో నాయకులు శ్రీరాముల మురళీమనోహర్, రాజిరెడ్డి, కుమారస్వామి, దిలీప్‌నాయక్, దుప్పటి భద్రయ్య, త్రిలోకేశ్వర్‌రావు, భాస్కర్, రవళి పాల్గొన్నారు.