ప్రభుత్వాన్ని కూలుస్తారని కేసీఆర్‌కు భయం: పొన్నం | ponnam blames on kcr govt | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాన్ని కూలుస్తారని కేసీఆర్‌కు భయం: పొన్నం

Published Wed, Sep 9 2015 1:02 AM | Last Updated on Thu, Oct 4 2018 6:57 PM

ponnam blames on kcr govt

కరీంనగర్ సిటీ: విదేశీ పర్యటనకు వెళ్లి తిరిగొచ్చే సరికి అల్లుడో, కొడుకో, కూతురో ప్రభుత్వాన్ని కూలుస్తారనే భయంతోనే సీఎం కేసీఆర్ తన వెంట సభాపతులను తీసుకెళ్లాడని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. మంగళవారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్టీఆర్ తరహాలో ఏదైనా కీడు జరుగుతుందనే భయంతోనే అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్‌లను చైనా పర్యటనకు వెంట తీసుకెళ్లారన్నారు.

ప్రస్తుతం చైనాలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందని, షేర్‌మార్కెట్ కుప్పకూలుతోందని, ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు తీసుకొస్తామంటూ వెళ్లడం అవివేకమన్నారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలను పట్టించుకోకుండా చైనాకు వెళ్లడం నీరో చక్రవర్తి తీరును తలపిస్తోందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేను కొడితే విదేశీయానం గిఫ్ట్‌గా ఇస్తామని చెప్పేందుకే ఎమ్మెల్యే గువ్వల బాలరాజును కేసీఆర్ వెంట తీసుకెళ్లారని ఆరోపించారు. సీఎం పర్యటనలను తప్పు పట్టడం లేదని, కానీ ఇప్పుడు చైనాకు వె ళ్లిన సందర్భం సరైంది కాదన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement