Prabhakar ponnam
-
నిర్బంధానికి పరాకాష్ట
పొన్నం దీక్ష భగ్నంపై ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను తెల్లవారుజామున అరెస్టు చేయడం టీఆర్ఎస్ నిర్బంధకాండకు పరాకాష్ట అని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేయాలని ప్రజాస్వామికంగా కొట్లాడటమే తప్పా అని మంగళవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. సిరిసిల్లలో టీఆర్ఎస్ పాలకుల దాష్టీకానికి గురైన దళితులను పరామర్శించడానికి లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ సభ పెడతామంటే అనుమతి ఇవ్వలేదని, ఇప్పుడేమో ఇచ్చిన హామీపై మాట్లాడకుండా పొన్నంను అరెస్టు చేశారని విమర్శించారు. మెడికల్ కాలేజీపై ఎలాంటి హామీ ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రగతి భవన్లో, ఫాంహౌజ్‌లో గడుపుతూ ప్రజల మధ్యకు రావడానికి భయపడుతున్నారని దుయ్యబట్టారు. సిరిసిల్లలో దళితులపై పోలీసులతో థర్డ్ డిగ్రీని ప్రయోగించి చిత్రహింసలకు గురిచేసిన మంత్రి కేటీఆర్ ఇప్పుడు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. బాధిత దళితులను దొంగచాటుగా వేములవాడలో పరామర్శించి నక్క వినయాలు ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. -
కరీంనగర్ జెడ్పీ సమావేశం రసాభాస
నిధులు, విధుల కోసం కాంగ్రెస్ జెడ్పీటీసీల ఆందోళన భిక్షాటన, బైఠారుుంపు జెడ్పీటీసీల అరెస్ట్, సస్పెన్షన్ కరీంనగర్: స్థానిక సంస్థలకు నిధులు, విధులు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ జెడ్పీటీ సీ, ఎంపీపీ సభ్యులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఆదివారం నిర్వహించిన జెడ్పీ సర్వసభ్య సమావేశానికి ముందు ప్రభు త్వ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ జెడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు చల్లా నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రతిమ మల్టీప్లెక్స్ హోటల్ ఎదుట భిక్షాటన చేశారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరుగుతున్న జెడ్పీ సర్వసభ్య సమావేశానికి వచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ పోడియం ఎదుట బైఠారుుంచారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ, మరో వైపు అధికార పార్టీ సభ్యుల నినాదాలతో సభ హోరెత్తింది. ఈ దశలో జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, కరీంనగర్, మంథని ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్ట మధు జోక్యం చేసుకుని సభకు అంతరాయం కలిగించొద్దని, సభ నడిచేలా సహకరించాలని కోరారు. నిధుల వ్యవహారంపై ఏదో ఒకటి తేల్చాలని పట్టుబట్టడంతో గందరగోళం నెలకొంది. మరోసారి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా కాంగ్రెస్ జెడ్పీటీసీలు పోడియం ముందు నుంచి లేచేది లేదని పట్టుబట్టారు. దాదాపు ఇరవై నిమిషాలపాటు గందరగోళం నెలకొనడంతో..సభకు అంతరాయం కలిగిస్తున్న కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు జెడ్పీ చైర్పర్సన్ ప్రకటించారు. అరుునా ఆందోళన కొనసాగించడంతో పోలీసులు వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టులు అప్రజాస్వామికం..డీసీసీ చీఫ్ కటకం, మాజీ ఎంపీ పొన్నం స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ జెడ్పీ సర్వసభ్య సమావేశంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ జెడ్పీటీసీలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గందె మాధవి వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. స్థానిక సంస్థల ప్రతినిధులపై పోలీసుల జులుం అమానుషమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ, ఎంపీపీలను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, విపక్షనేత జానారెడ్డి ఫోన్లో పరామర్శించారు. జెడ్పీ నిధులు, విధులపై త్వరలో నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని హామీ ఇచ్చారు. -
ప్రశాంతంగా చేప ప్రసాదం పంపిణీ
అబిడ్స్/గన్‌ఫౌండ్రీ: మృగశిరకార్తెను పురస్కరించుకొని బత్తిని సోదరులు చేపట్టిన చేపప్రసాదం పంపిణీ కార్యక్రమం బుధవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7.39 గంటలకు బత్తిని కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించి ప్రసాదం పంపిణీని ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, న్యూ ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, హర్యానా, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి వేలాదిమంది చేప ప్రసాదం కోసం తరలివచ్చారు. ఈ కార్యక్రమం గురువారం ఉదయం వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. సైడ్ లైట్స్.. మధ్యాహ్నం నుంచి ప్రసాదం కోసం వచ్చేవారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. వికలాంగులకు, వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో వీఐపీలకు ప్రత్యేక కౌంటర్ చేప ప్రసాదం స్వీకరించిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సీసీ కెమెరాల ద్వారా నిఘా....మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు. 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు డీసీపీ కమలాసన్ రెడ్డి స్వీయ పర్యవేక్షణ.... పంపిణీకి 32 కేంద్రాల ఏర్పాటు. దాదాపు 50 వేల చేపపిల్లలను విక్రయించినట్లు అధికారుల వెల్లడి. వైద్య శాఖ ఆధ్వర్యంలో నాలుగు ఆరోగ్య శిబిరాలు 108 అంబులెన్స్‌ల ద్వారా అత్యవసర చికిత్స మోజంజాహి మార్కెట్ నుంచి ఎగ్జిబిషన్ మీదుగా నాంపల్లికి వెళ్లే వాహనాలను అబిడ్స్ మీదుగా, గోషామహల్ నుంచి వచ్చే వాహనాలను దారుస్సలాం మీదుగా మళ్లించారు. బద్రి విశాల్ పిత్తి, అగర్వాల్ సేవా దళ్, అగర్వాల్ సేవా సమాజ్, పంజాబ్ సేవా సమితి, జైశ్వాల్ సమాజ్‌లతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ఆస్తమా రోగులకు అన్ని రకాల అల్పాహారాలు అందించాయి. హైదరాబాద్ మెట్రో వాటర్బోర్డ్ ఆధ్వర్యంలో 3 లక్షల వాటర్ ప్యాకెట్ల పంపిణీ చేశారు. ఎగ్జిబిషన్ మైదానం ప్రవేశం ద్వారం చేపప్రసాదం అశాస్త్రీయమని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. -
ప్రభుత్వాన్ని కూలుస్తారని కేసీఆర్‌కు భయం: పొన్నం
కరీంనగర్ సిటీ: విదేశీ పర్యటనకు వెళ్లి తిరిగొచ్చే సరికి అల్లుడో, కొడుకో, కూతురో ప్రభుత్వాన్ని కూలుస్తారనే భయంతోనే సీఎం కేసీఆర్ తన వెంట సభాపతులను తీసుకెళ్లాడని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. మంగళవారం కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్టీఆర్ తరహాలో ఏదైనా కీడు జరుగుతుందనే భయంతోనే అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్‌లను చైనా పర్యటనకు వెంట తీసుకెళ్లారన్నారు. ప్రస్తుతం చైనాలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందని, షేర్‌మార్కెట్ కుప్పకూలుతోందని, ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు తీసుకొస్తామంటూ వెళ్లడం అవివేకమన్నారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలను పట్టించుకోకుండా చైనాకు వెళ్లడం నీరో చక్రవర్తి తీరును తలపిస్తోందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేను కొడితే విదేశీయానం గిఫ్ట్‌గా ఇస్తామని చెప్పేందుకే ఎమ్మెల్యే గువ్వల బాలరాజును కేసీఆర్ వెంట తీసుకెళ్లారని ఆరోపించారు. సీఎం పర్యటనలను తప్పు పట్టడం లేదని, కానీ ఇప్పుడు చైనాకు వె ళ్లిన సందర్భం సరైంది కాదన్నారు. -
చీప్ లిక్కర్‌కు వ్యతిరేకంగా పోరు
రౌండ్‌టేబుల్ సమావేశంలో అఖిలపక్షాల పిలుపు హైదరాబాద్: చీప్‌లిక్కర్ ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగుతులను దెబ్బతీసే విధంగా రూపొందిస్తున్న మద్యం పాలసీ(చీప్ లిక్కర్)ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. సీఎం, ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే గజ్వేల్ లేదా సిరిసిల్ల నుంచే ఉద్యమానికి శ్రీకారం చూట్టాలని నిర్ణయించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలంగాణ మద్య వ్యతిరేక ఉద్యమం’ ఆధ్వర్యంలో రౌండ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గుడుంబాపై ఉక్కుపాదం మోపాలంటూనే చీప్ లిక్కర్ అమ్మకాలను పెంచాలనుకోవడం తగదన్నారు. చీప్ లిక్కర్‌కు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు తీర్మానం చేయాలని సూచించారు. బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ అసెంబ్లీ శీతాకాల సమావేశంలో సారాపై పోరాడతామన్నారు. కేంద్ర మాజీమంత్రి బలరాం నాయక్ మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్సార్ ఆదివాసీల పోడు భూములకు పట్టాలు ఇస్తే వాటినిప్పుడు రద్దు చేసి సారా ఇస్తారా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ నేత ఆదం విజయ్ కుమార్ మాట్లాడుతూ బంగారు తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమించకుంటే ప్రభుత్వం సారాగ్రిడ్ను కూడా తీసుకువస్తుందని తెలంగాణ ఉద్యమవేదిక అధ్యక్షుడు చెరకు సుధాకర్ అన్నారు. కార్యక్రమంలో సామాజిక ఉద్యమనేత వీజీఆర్ నారగోని, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, డా. శ్రవణ్, ఆప్ నేతలు నమ్రత, వెంకటరెడ్డి, పద్మశాలీ సంఘం నేత టి.నాగయ్య, మా జీ ఎమ్మెల్యే బి.బిక్షమయ్యగౌడ్, ప్రజాసంఘాల నేతలు బెల్లయ్య నాయక్, మంజీలాల్ నాయక్, షకీల, బి.శోభారాణి, బాలలక్ష్మి పాల్గొన్నారు. మద్యం పాలసీ ఉపసంహరించాలి: సీపీఐ హైదరాబాద్: పేదల సామాజిక, ఆర్థిక స్థితిగతులను దెబ్బతీసే విధంగా రూపొందిస్తున్న మద్యం పాలసీని వెం టనే ఉపసంహరించుకోవాలని సీపీఐ డిమాండ్ చేసింది. గుడుంబాను అరికట్టాలంటే చీప్‌లిక్కర్ అమ్మడం ప్రత్యామ్నాయం కాదని, బెల్ట్‌షాపుల ద్వారా ఏటా రూ.4 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి గండిపడుతోందని, వాటి ని యంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించింది. మంగళవారం మఖ్దూంభవన్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర సమితి సమావేశాల్లో చర్చించిన తీర్మానాలను పార్టీ ఆమోదించింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చాలని సీఎం కేంద్రాన్ని కోరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పారు. -
ఉద్యాన వర్సిటీ దక్కేనా!
- మన నేతల యత్నాలు ఫలిస్తాయా? - వర్సిటీ ఏర్పాటుపై నీలినీడలు కథలాపూర్ : తెలంగాణ రాష్ట్రానికి మంజూరైన హార్టికల్చర్ యూనివర్సిటీ జిల్లాకు దక్కుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న మెదక్ జిల్లా గజ్వేల్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభం కావడంతో జిల్లాలో ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇక్కడ అనువైన స్థలం ఉందని అధికారులు నివేదించినా పరిగణలోకి తీసుకోకపోవడంతో విద్యాభిమానులు నిరాశ చెందుతున్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేస్తే తప్ప వర్సిటీ దక్కే అవకాశం లేదని నాయకులు పేర్కొంటున్నారు. అందుబాటులో భూమి.. జగిత్యాల డివిజన్లోని కథలాపూర్ మండలం గంభీర్పూర్ శివారులో సర్వేనెంబర్ 570లో 313 ఎకరాలు, సర్వేనెంబర్ 571లో 460 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని, ఇది వర్సిటీకి అనుకూలంగా ఉంటుందని అధికారులు రాష్ట్ర అధికారులకు నివేదిక పంపించారు. దీంతో ఇక్కడే వర్సిటీ ఏర్పాటవుతుందని అందరూ ఆశపడ్డారు. ఇంతలో సీఎం కేసీఆర్ గజ్వేల్ ప్రతిపాదన తేవడంతో అనుమానాలు మొదలయ్యాయి. దీనికితోడు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయాలని మరికొందరు ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో స్థాని క నాయకులు ఎమ్మెల్యే రమేశ్‌బాబు, ఎంపీ వినోద్‌కుమార్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, మంత్రి ఈటెల రాజేందర్‌ను కలిసి సమస్యను వివరించారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో సైతం వర్సిటీని గంభీ ర్పూర్లోనే ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించి ఆ ప్రతులను మంత్రులకు, సీఎంకు పంపించా రు. జగిత్యాలలో వ్యవసాయ పరిశోధన కేంద్రం ఉన్న తరుణంలో, గంభీర్పూర్లో హార్టికల్చర్ యూనివర్సిటీ నెలకొల్పితే ప్రయోజనం చేకూరుతుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు ఇందు కో సం కృషి చేయాలని, వర్సిటీని తరలిపోకుండా చూడాలని వారు కోరుతున్నారు. జిల్లాలోనే ఏర్పాటు చేయాలి : మాజీ ఎంపీ పొన్నం కరీంనగర్ : తెలంగాణాకు కేంద్రం కేటాయించిన ఉద్యాన యూనివర్సిటీని జిల్లాలోనే నెలకొల్పేలా ముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నా రు. ఆదివారం ఆర్అండ్బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని కథలాపూర్, అంతర్గాంలలో ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడానికి అనువైన స్థలం ఉందని పేర్కొన్నారు. జిల్లాలో ఉద్యాన వర్సిటీ నెలకొల్పితే వ్యవసాయం రంగంతోపాటు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ యూనివర్సిటీకి స్వాతంత్య్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని కోరారు. ఆయన చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని, ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహాన్ని నెలకొల్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌కు రాజకీయ జన్మనిచ్చిన కరీంనగర్లో కాకుండా ఉద్యాన వర్సిటీని గజ్వేల్‌లో నెలకొల్పాలనుకోవడం తగదన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను దశలవారీగా అమలు చేయాలని, మాట నిలుపుకోకుంటే ప్రజల పక్షాన పోరాడుతామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో గెలిచిన వారు టీఆర్ఎస్లో చేర డం అప్రజాస్వామికమని, వారు పదవులకు రాజీ నామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఆదేశిస్తే రెడీ కాంగ్రె స్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఏ పదవి తీసుకోవడానికైనా తాను రెడీగా ఉన్నట్లు పొన్నం పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి తాను కోరుకోలేదని, కానీ అధిష్టానం ఆదేశిస్తే చేపట్టడానికి సిద్ధమేనని అన్నారు. ఆయన వెంట మాజీ మేయర్ డి.శంకర్, కన్నకృష్ణ, కర్ర రాజశేక ర్, మల్లికార్జున రాజేందర్, ఆమ ఆనంద్ తదితరులు ఉన్నారు.